కృతిస‌న‌న్ ఎంపిక క‌రెక్టేనా?

`ఆదిపురుష్‌`…. ప్ర‌భాస్ అభిమానులు క‌ల‌వ‌రిస్తున్న పేరు. దాదాపు 400 కోట్ల‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామ‌ని చిత్ర‌బృందం గ‌ర్వంగా చెబుతోంది. అయితే ప్ర‌భాస్‌కి ధీటుగా న‌టీన‌టుల్ని ఎంపిక చేసుకోవ‌డంలో ద‌ర్శ‌కుడు ఓంరౌత్ త‌డ‌బ‌డుతున్నాడేమో అనిపిస్తోంది. ప్ర‌భాస్ కి విల‌న్ గా సైఫ్ అలీఖాన్ ని ఎంచుకున్నాడు ఓం రౌత్‌. సైఫ్‌కి సౌత్ లో పెద్ద ఫాలోయింగ్ లేదు. బాలీవుడ్ లోనూ అంతంత మాత్ర‌మే. కాబ‌ట్టి.. సైఫ్ ఎంపిక చాలామందిని ఆశ్చ‌ర్య‌పరిచింది. ఇప్పుడు క‌థానాయిక‌గా కృతి స‌న‌న్ పేరు గ‌ట్టిగా వినిపిస్తోంది. సీత పాత్ర‌లో ఆమె ఎంపిక దాదాపుగా ఖాయ‌మైంద‌ని చెప్పుకుంటున్నారు. అదే నిజమైతే.. ఓం రౌత్ మ‌రో త‌ప్ప‌ట‌డుగు వేశాడ‌నిపిస్తుంది.

ఎందుకంటే.. కృతి స‌న‌న్ ఫ్లాప్ హీరోయిన్‌. త‌ను చేసిన సినిమాలన్నీ ఫ్లాపే. తెలుగులో కృతిని ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. పోనీ.. నార్త్ లో వెలిగిపోతోందా అంటే అదీ లేదు. ఓ ప‌క్క‌… ప్ర‌భాస్ కోసం బ‌డా హీరోయిన్లు దిగి వ‌స్తున్నారు. రాధే శ్యామ్ లో పూజా హెగ్డే న‌టిస్తోంది. నాగ అశ్విన్ సినిమా కోసం.. దీపిక ప‌దుకొణెని తీసుకున్నారు. ఇలా.. బాలీవుడ్ లో స్టార్‌రేంజ్ ఉన్న క‌థానాయిక‌ల్నే తీసుకుంటున్నారంతా. పాన్ ఇండియా స్థాయి సినిమాకి ఇలాంటి ఆక‌ర్ష‌ణ‌లు త‌ప్ప‌నిస‌రి. అభిమానులూ అదే కోరుకుంటారు. అలాంట‌ప్పుడు.. ఫ్లాప్ హీరోయిన్ ని వెదికి ప‌ట్టుకోవ‌డం, అందులోనూ `సీత‌` లాంటి పాత్ర‌కు కావ‌డం.. కాస్త మింగుడు ప‌డ‌ని విష‌య‌మే. కీర్తి, కైరా అడ్వాణీ లాంటి పేర్లు ఈ పాత్ర కోసం వినిపించాయి. కృతిది ఆ రేంజు కూడా కాదాయె. ఇదంతా… హీరోయిన్‌, ఇత‌ర న‌టీన‌టుల‌పై పెట్టే బ‌డ్జెట్ త‌గ్గించుకొనే ప్ర‌య‌త్నాలేమో అనిపిస్తోంది. మ‌రి చిత్ర‌బృందం ఏమంటుందో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌తంజ‌లిని మ‌ళ్లీ నిల‌దీసిన సుప్రీం… ఈసారి ఇంకా ఘాటుగా!

ప‌తంజ‌లి క్ష‌మాప‌ణ‌ల‌కు స‌సేమిరా అంటున్న సుప్రీంకోర్టు... ప‌తంజ‌లి ప్ర‌మోట‌ర్ల‌పై మ‌రోసారి మండిప‌డింది. కావాల‌నే తెలివిగా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై సాగుతున్న విచార‌ణ‌లో భాగంగా...

సూర‌త్ ఎన్నిక వెనుక జ‌రిగింది ఇదేనా?- బీజేపీలోకి కాంగ్రెస్ అభ్య‌ర్థి

క‌మ‌ల వికాసం మొద‌లైపోయింది. సూర‌త్ లో బీజేపీ అభ్య‌ర్థి గెలుపుతో మొద‌లైన ఈ హ‌వా 400సీట్ల‌కు చేర‌కుంటుంద‌ని బీజేపీ సంబురాలు చేసుకుంటుంది. అనైతిక విజ‌యం అంటూ కాంగ్రెస్ విరుచుక‌ప‌డుతుంటే, నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణకు గురైన...

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close