రివ్యూ : ‘క్షణం’ – మరు క్షణం ఏం జరుగుతుందనే సస్పెన్స్ చిత్రం…!

ఆ మధ్య ‘సైజ్ జీరో’ అంటూ వినూత్న కథాంశంతో విభిన్న మైన సినిమా నిర్మించిన పీవీపీ ఇప్పుడు ‘క్షణం’ అనే థ్రిల్లర్ ను అందించారు.ఎప్పుడు భారి బడ్జెట్ తో సినిమాలు తీయడం పీవీపీ సంస్థ పొట్లూరి వి. ప్రసాద్, ఈ సారి అతి తక్కువ బడ్జెట్ లో నిర్మించిన చిత్రం. సినిమా నిర్మాణానికి అయిన బడ్జెట్ పబ్లిసిటీ కి ఖర్చు పెట్టడం ఈ సినిమా కున్న ప్రత్యకత. ఫస్ట్ లుక్ నుండి అడివి శేష్, అదా శర్మ, యాంకర్ అనసూయ నటించిన ‘క్షణం’ చిత్రం పోస్టర్స్ పరంగా అందర్నీ ఆకట్టుకుంది. ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఓ మంచి థ్రిల్లర్ మూవీ చూడబోతున్నామనే ఫీల్ ను ప్రేక్షకులకు కలగజేసింది. మరి.. కొత్త దర్శకుడు రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం…

కథ:

అమెరికాలో సొంతంగా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ నడుపుతుంటాడు రిషి (అడవి శేష్). అక్కడ ఎన్నారై గా స్థిరపడతాడు. సోలోగా లైఫ్ లీడ్ చేస్తున్న రిషి, తనతో డేటింగ్ చేయడానికి సిద్ధమైన అమ్మాయిని కూడా ఇంట్రెస్ట్ లేదని పక్కన పెట్టేస్తాడు.తన బిజినెస్ చూసుకుంటున్న రిషికి ఓ రోజు తన ఫోన్ కి వచ్చిన మెసేజ్ అతని జీవితాన్ని మలుపు తిప్పేస్తుంది. నాలుగేళ్ల క్రితం దూరమైన శ్వేత (ఆదాశర్మ) తనను కలవాలంటూ రిషికి మెసేజ్ కి పెడుతుంది. వెంటనే ఇండియాలో ఉన్న శ్వేతను కలుసుకోవడానికి బయలుదేరి వస్తాడు రిషి. శ్వేతను కలిసిన రిషికి ఆమెకు కార్తీక్ (సత్యదేవ్) తో పెళ్లయ్యిందని తెలుస్తుంది. ఆమెకు ఓ పాప రియా ఉందని, ఆ పాపను ఎవరో కిడ్నాప్ చేసారని, తనకు హెల్ప్ చేయమని రిషిని అడుగుతుంది శ్వేత. తను ఎంతో గాఢంగా ప్రేమించి, పెళ్లి చేసుకుందామనుకున్న శ్వేత పెళ్లి చేసుకోవడం, ఓ పాపకు తల్లవ్వడం, ఆ పాప కిడ్నాప్ కి గురయ్యిందని హెల్ప్ చేయమని అడగడంతో రిషి షాక్ అవుతాడు. ఆమె కోసం పాపను వెతకడం మొదలుపెడతాడు. శ్వేత ఉంటున్న అపార్ట్ మెంట్ లోని కొంతమంది ద్వారా అసలు శ్వేతకు పిల్లలే లేరని తెలుస్తుంది. దాంతో రిషి మరింత షాక్ అవుతాడు. శ్వేత భర్త కార్తీక్ కూడా తమకు పిల్లలు లేరని, ఓ యాక్సిడెంట్ లో శ్వేత కొన్ని రోజుల పాటు కోమాలో ఉందని, కోమాలోంచి బయటికి వచ్చిన తర్వాత తనకు కూతురు ఉందని చెబుతోందని చెబుతాడు.

మరి ఫైనల్ గా రిషి ఎలా రియాని కనుక్కున్నాడు.. అసలు పాపే లేదని శ్వేత భర్త, పోలీసులు ఎందుకు నమ్మించడానికి ట్రై చేసారు.. నాలుగేళ్ల క్రితం విడిపోయిన రిషికే ఎందుకు ఫోన్ చేసి పాప విషయంలో సహాయం చేయమని శ్వేత అడుగుతుంది అనేదే ఈ చిత్రం కధ.

నటీనటుల పెర్ఫార్మన్స్ :

మెడికల్ స్టూడెంట్ గా, ఓ ఎన్నారైగా, , ప్రేమికుడిగా రిషి పాత్రను అద్భుతంగా చేసాడు అడవి శేష్. ఎమోషన్, లవ్… చక్కగా పలికించాడు. ఓ ప్రేమికురాలిగా, తన పాప కిడ్నాప్ కు గురైతే ఓ తల్లి పడే ఆవేదన శ్వేత క్యారెక్టర్ లో ఉన్నాయి. ఈ క్యారెక్టర్ ని ఆవిష్కరించడానికి తనవంతు కృషి చేసింది ఆదాశర్మ. ఎసిపి గా అనసూయ భరద్వాజ్ ఓ సీరియస్ రోల్ ని చేసింది. ఎసిపి రోల్ కి సరిపడా పిజిక్, బాడీ లాంగ్వేజ్ తో అనసూయ ఆకట్టుకుంటుంది. సత్య, రవివర్మ, వెన్నెల కిషోర్ తమ పాత్రల పరిధిమేరకు నటించాడు. సత్యం రాజేష్ అక్కడడక్కడా సెటైర్లతో నవ్వించడంతో పాటు, పోలీస్ ఆఫీసర్ గా బాగున్నాడు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.

సాంకేతిక వర్గం:

అడవి శేష్ అల్లుకున్న ఈ స్టోరీ లైన్ లైన్ చాల బాగుంది. సింఫుల్ స్టోరీ లైన్ అయినప్పటికీ గ్రిప్పింగ్ స్ర్కిన్ ప్లే తనే ఇవ్వడంలో అడవి శేష్ సక్సెస్ అయ్యారు. ఫస్ట్ టైమ్ డైరెక్షన్ చేసినప్పటకీ, తడబాటు లేకుండా, సినిమాని ప్రజెంట్ చేయడంతో రవికాంత్ పేరెపు పాస్ అయ్యాడు, ఇలాంటి సస్పెన్స్ థ్లిల్లర్స్ కి పాటలకంటే కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. ఆ పరంగా సంగీత దర్శకుడు చరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి పూర్తి న్యాయం చేసారు . అబ్బూరి రవి రాసిన డైలాగులు షార్ట్ అండ్ స్వీట్ గా బాగున్నాయి. కథ డిమాండ్ మేరకు ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ఖర్చు పెట్టారు నిర్మాతలు.

విశ్లేషణ:

ఫస్టాప్ అంతా పాప కిడ్నాప్ అవ్వడం, పాపను కనిపెట్టే ప్రాసెస్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అసలు శ్వేతకు కూతురు లేదనే ట్విస్ట్ ఆడియన్స్ లో మరింత ఆసక్తిని కలుగుజేస్తుంది. మొత్తం మీద క్షణం క్షణం ఉత్కంఠతకు గరి చేస్తూ, సస్పెన్స్ మెయింటెన్ చేయడంలో మాత్రం సక్సెస్ సాధించారు. అసలేం జరుగుతుంది, అని పాయింట్ రివీల్ చేసేంతవరకూ ఊహకు అందకుండా కథను చెప్పడంలో అడివి శేష్ మలిచిన స్ర్కీన్ ప్లేని మెచ్చుకోవాల్సిందే.చివరాఖరికి చెప్పేదేంటంటే రొటీన్ కి భిన్నంగా ఉన్న ఈ సినిమాని ఓసారి చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు. క్షణం టైటిల్ కి తగ్గట్టు, మరు క్షణం ఏం జరుగుతుందనే సస్పెన్స్ ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.

తెలుగు360.కామ్ రేటింగ్‌: 2.75/5

బ్యానర్స్ : పివిపి, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్
నటీనటులు : అడవి శేష్, ఆదాశర్మ, అనసూయ భరద్వాజ, సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవివర్మ తదితరులు
ఎడిటింగ్ : అర్జున్ శాస్త్రి
సంగీతం : శ్రీ చరణ్ పాకాల
మాటలు, స్ర్కిఫ్ట్ గైడెన్స్ : అబ్బూరి రవి
నిర్మాతలు : పరమ్ .వి.పొట్లూరి, కెవిన్ అన్నె
కథ, స్ర్కీన్ ప్లే : అడవి శేష్
దర్శకత్వం : రవికాంత్ పేరెపు

CLICK HERE FOR ENGLISH REVIEW

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close