మొన్న కాలికి దెబ్బ.. ఇప్పుడు కరోనా..!

ఇరవై నాలుగు గంటలూ తీరిక లేకుండా ఉండే మంత్రి కేటీఆర్‌కు ఇటీవలి కాలంలో ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితులు ఎక్కువగా వస్తున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి ఆయనకు ఇంట్లోనే ఉండేలా సిట్యూయేషన్స్ ఎదురవుతున్నాయి. కేటీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఒంట్లో నలతగా ఉండటం.. స్వల్ప లక్షణాలు కనిపిస్తూండటంతో ఆయన టెస్ట్ చేయించుకున్నారు. రిపోర్టుల్లో పాజిటివ్ అని రావడంతో ఇంట్లోనే ఐసోలేట్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. కొద్ది రోజులుగా తనను కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలని కేటీఆర్ కోరారు.

కేటీఆర్ ఇటీవలే ఇంట్లో ప్రమాదానికి గురయ్యారు. కాలు ఫ్రాక్చర్ అయింది. దీంతో మూడు వారాల పాటు బెడ్ రెస్ట్‌కే పరిమితమయ్యారు. ఇటీవలే ఆయన కోలుకుని స్వల్పంగా నడవగలుగుతున్నారు. మళ్లీ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న సమయంలో ఆయనకు కరోనా పాజిటివ్‌గా రావడంతో మరికొద్ది రోజులు ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది. అయితే గతంలోలా ఇప్పుడు కరోనాకు రెండు వారాల పాటు ఐసోలేషన్‌లోఉండటం లేదు. నాలుగైదు రోజుల తర్వాత టెస్టులు చేయించుకుని మళ్లీ రోజువారీ కార్యక్రమాలు ప్రారంభించారు. అయితే మళ్లీ వెంటనే కరోనా బారిన పడ్డారు.

కేటీఆర్‌కు కరోనా సోకడం ఇది రెండో సారి. గత ఏడాది కూడా ఆయన కరోనా బారిన పడ్డారు. అప్పట్లో కొన్ని శ్వాస కోశ సమస్యలు కూడా తలెత్తాయని కేటీఆర్ కొన్ని సందర్భాల్లో చెప్పారు. అయితే రెండు రోజుల ట్రీట్‌మెంట్ తర్వాత తగ్గిపోయాయన్నారు. ఇప్పుడు కూడా స్వల్ప కరోనా లక్షణాలే ఉన్నందున ఇంట్లోనే ఐసోలేట్ అవ్వాలని నిర్ణయించుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close