లోకేష్ కోసం నారాయ‌ణ త్యాగం చేస్తారా..?

ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్‌కు మంత్రి ప‌ద‌వి దాదాపు ఖరారు అయిపోయింది. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ఇదే మంచి త‌రుణ‌మ‌ని చంద్ర‌బాబు భావిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఎవ‌రిని త‌ప్పించాలీ… ఎవ‌రిని ఒప్పించాలీ అనే చ‌ర్చ పార్టీ వ‌ర్గాల్లో జ‌రుగుతోంద‌ట‌! త‌ప్పించే వారి జాబితాపై ఇప్ప‌టికే చాలా క్లారిటీ ఉంది. మంత్రులు పీత‌ల సుజాత‌, రావెల కిషోర్ బాబు, మృణాళిని, ప్ర‌త్తిపాటి, ప‌ల్లె ర‌ఘునాధ‌రెడ్డి… వీరికి ప‌ద‌వీ గండం ఉంద‌ని మొద‌ట్నుంచీ అనుకుంటున్న‌దే. ఇక‌, త‌ప్పిస్తూనే ఒప్పించాల్సినవారిలో కీల‌క మంత్రి ఒక‌రున్నారని వినిపిస్తోంది! ఆయ‌నే… మంత్రి నారాయ‌ణ‌!

అవునండీ, మంత్రి వ‌ర్గ మార్పుల్లో ఆయ‌న పేరు కూడా ఇప్పుడు వినిపిస్తూ ఉండ‌టం విశేషం! అదేంటీ.. చంద్ర‌బాబుకి ‘బాగా’ కావాల్సి నాయకుడు.. ఎన్నిక‌ల ముందు తెలుగుదేశం పార్టీకి ‘అన్ని’ విధాలుగా వెన్నూద‌న్నుగా ఉన్న నాయ‌కుడు… ఆయ‌న‌కి ప‌ద‌వీ గండం ఏంటా ఆశ్చ‌ర్యపోవ‌ద్దు! అయినా, ఆ కృత‌జ్ఞ‌త‌తోనే క‌దా.. నేరుగా ఎన్నిక‌ల్లో గెల‌వ‌క‌పోయినా కూడా కీల‌క‌మైన శాఖ‌ల బాధ్య‌త‌లు నారాయ‌ణ‌కు అప్ప‌గించారు. రాజ‌ధాని అమ‌రాతి నిర్మాణంలో కూడా ఆయ‌న‌దే క్రియాశీల పాత్ర ఇచ్చారు! ఇంకేం కావాలి..? అయితే, ఇప్పుడు చిన‌బాబు కోసం మంత్రిగారు కాస్త త్యాగం చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది… అంతే!

నారా లోకేష్‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాలంటూ చాన్నాళ్లుగా తెలుగుదేశం నేత‌లు ప‌ట్టుబ‌డుతున్నారు. ఎట్ట‌కేల‌కు విస్త‌ర‌ణ ఉంటుంద‌ని అంటున్నారు కాబ‌ట్టి, చిన‌బాబుకు కీల‌క శాఖ‌ల బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని చంద్ర‌బాబు అనుకుంటున్నార‌ట‌. మున్సిప‌ల్‌, ఐటీ శాఖ‌ల్ని లోకేష్‌కు ఇస్తార‌ని చెప్పుకుంటున్నారు. అందుకే, మంత్రి నారాయ‌ణ‌కు మార్పు త‌ప్ప‌ద‌ని అంటున్నారు. అయితే, ఇదే విష‌యాన్ని ఆయ‌న‌కి సున్నితంగా న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం.

మంత్రి ప‌ద‌వి నుంచి నారాయ‌ణ‌ను త‌ప్పించినా, కీల‌క‌మైన రాజ‌ధాని సంస్థ‌కు ఛైర్మ‌న్ బాధ్య‌త‌లు ఆయ‌న‌కే ఇచ్చే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. అది కూడా ఆషామాషీ ప‌ద‌వి కాదు క‌దండీ! అస‌లే అమ‌రావ‌తి.. ఆ ప్రాంతానికి ఇప్పుడు ఎంత ‘విలువ’ ఉందో ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన ప‌నిలేదు. అందుకే, ఈ ప‌ద‌వికి కూడా క్యాబినెట్ హోదా క‌ల్పించి.. నారాయ‌ణ‌ను సంతృప్తిప‌ర‌చాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌! మ‌రి, ఈ ప్ర‌తిపాద‌న‌కు మంత్రిగారు ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి. చిన‌బాబు కోసం చిన్న అడ్జెస్ట్‌మెంట్ అని చెబుతున్నా… ప్ర‌య‌త్నామ్నాయం చూపిస్తున్నా… ఈ క్ర‌మంలో మంత్రి ప‌ద‌వి పోవ‌డం అయితే ఖాయమే క‌దా! సో… నారాయ‌ణ రియాక్ష‌న్ ఎలా ఉంటుందో మ‌రి!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రైవేట్ సైన్యం…జగన్ కు ఎందుకంత భయం..!!

వైసీపీ అధినేత జగన్ రెడ్డి భారీగా ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నారు. తాడేపల్లిలోని జగన్ నివాసం చుట్టూ 30మందితో కొత్తగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఇంత పెద్దమొత్తంలో ఆయన ప్రైవేట్ సైన్యాన్ని నియమించుకోవడం హాట్...

రీఎంట్రీకి శిశికళ రెడీ !

తమిళనాట స్టాలిన్‌కు పోటీ ఎవరు అన్నదానిపై క్లారిటీ లేకపోవడంతో రాజకీయ శూన్యత ఏర్పడింది. అన్నామలైకు తమిళనాడులో తప్ప బయట కావాల్సినంత హైప్ వస్తోంంది. తమిళనాడులో పట్టించుకునేవారు లేరు. పన్నీరు సెల్వం,...
video

కల్కి.. సమయం చూడని సమరం

https://www.youtube.com/watch?v=5UfGZFrXKig మూడు సార్లు వాయిదా పడ్డ ‘కల్కి 2898 ఎ.డి’ భైరవ పాట ఎట్టకేలకు విడుదలైయింది. సంతోష్ నారాయణ స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి, కుమార్‌ రచించిన ఈ పాట... దిల్జీత్‌ దోసాంజ్, దీపక్‌ బ్లూ...

వైసీపీ నేతలకు గేట్లు క్లోజ్!

ఏపీలో వైసీపీ ఘోర పరాజయంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు నేతలు రెడీ అవుతున్నారా..? ఇప్పటికే పార్టీ మార్పుపై కొంతమంది టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్ళారా..? ఐదేళ్ళు టీడీపీ నేతలను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close