హైదరాబాద్ మెట్రోను వదిలించేందుకు L&T మరో ప్రయత్నం చేస్తోంది. గతంలో పలుమార్లు తమ వాటా అమ్మకానికి ప్రతిపాదనలు పెట్టింది. కానీ ప్రభుత్వాలు అనుమతించలేదు.నష్టాలు పేరుకుపోతూండటం.. కేంద్ర, రాష్ట్రాలు కనీస సాయం చేసే ఆలోచన చేయకపోవడతో.. నిర్వహణ నుంచి వైదొలగాలని ప్రయత్నిస్తోంది. తాజాగా హైదరాబాద్ మెట్రో నిర్వహణ భారం అవుతుందని కేంద్రానికి L&T లేఖ రాసింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్వహణ బాధ్యతను అప్పగిస్తామని.. స్పెషల్ పర్పస్ వెహికిల్ ను ఏర్పాటు చేయాలని L&T యాజమాన్యం కోరింది. వరుస నష్టాలతో పేరుకుపోయిన పెండింగ్ బకాయిల దృష్ట్యా మెట్రోను నడపలేమంటోన్న సంస్థ చెబుతోంది. పెట్టిన పెట్టుబడి సంగతి తర్వాత ముందుగా నిర్వహణలోనూ నష్టాలు వస్తున్నాయని వాటిని భరించలేకపోతున్నామని L&T చెబుతోంది.
హైదరాబాద్ మెట్రో.. బిజీయెస్ట్ మెట్రోల్లో ఒకటి. ప్రతిరోజూ 5 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతుంది. ప్రయాణికుల పరంగా ఆక్యుపెన్సీ విషయంలో ఎలాంటి ఫిర్యాదులు లేవు. అదే సమయంలో యాడ్స్, లీజుల ద్వారా అదనపు ఆదాయం వస్తున్నా సరే ఆదాయం సరిపోవడం లేదు. గతంలోనే వదిలించుకోవాలని ఎల్ అండ్ టీ అనుకుంది. కానీ కుదరలేదు.
ముంబై మెట్రోకు ఇలాంటి సమస్యలే వస్తే.. ఆ సంస్థకు ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఎకరాలను రూ. 820 కోట్లకు చొప్పున మూడున్నర వేల కోట్లకు ఆర్బీఐతో కొనిపించి గట్టెక్కిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే తమకూ ఏదో ఒకటి చేయాలని ఎల్ అండ్ టీ కోరుతున్నట్లుగా తెలుస్తోంది.
