రివ్యూ : ‘మజ్ను’ ఓ స్వచ్ఛమైన ప్రేమికుడి కథ

`ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం` నుండి జెంటిల్ మాన్ వరకు విభిన్నమైన చిత్రాలను ఎంపిక చేసుకుంటూ, వ‌రుస విజ‌యాల మీదున్న హీరో నాని స‌క్సెస్ కోసం చేసిన మ‌రో ప్ర‌య‌త్నం `మ‌జ్ను`.లైలా ప్రేమ కోసం అలనాటి మ‌జ్నుచనిపోయి చరిత్ర కెక్కాడు. అదే మ‌జ్ను టైటిల్ పెట్ట‌డంతో ఇదేదో విషాద ప్రేమ క‌థ అనుకోకుండా డిఫ‌రెంట్ ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ అని చెప్పడానికి పోస్ట‌ర్స్‌, టీజ‌ర్స్ నుండి చిత్రయూనిట్ చాలా జాగ్ర‌త్త‌లే తీసుకున్నారు. ఎన్నో విజయ వంతమైన చిత్రాలను నిర్మించిన ‘జెమినీ’ కిరణ్ ఆనంది ఆర్ట్స్ పతాకం పై, `ఉయ్యాలా జంపాలా`తో భారీ హిట్ సాధించిన ద‌ర్శ‌కుడు విరించి వ‌ర్మ డైరెక్ష‌న్ లో రూపొందిన ఈ సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. మ‌రి ఈ అంచ‌నాల‌ను `మ‌జ్ను` గా నాని మరో స‌క్సెస్ ని కొట్టాడా? అని తెలుసుకోవాలంటే సినిమా రివ్యూ లోకి వెళ‌దాం….

క‌థ :

ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ద‌గ్గ‌ర ఇంజనీరింగ్ చదివిన ఆదిత్య‌(నాని) అసిస్టెంట్ ద‌ర్శ‌కుడుగా వ‌ర్క్ చేస్తుంటాడు. స్నేహితుడు రామ్‌కోటి (స‌త్య‌) ప్రేమ‌కు హెల్ప్ చేయ‌డానికి వెళ్ళి అక్క‌డ సుమ‌ (ప్రియా శ్రీ)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమెతో త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తాడు. ఆదిత్య త‌న గురించి సుమ‌కు చెప్పే సంద‌ర్భంలో త‌న మాజీ గర్ల్‌ఫ్రెండ్ కిర‌ణ్మ‌యి(అనుఇమ్మాన్యుయ‌ల్‌)తో, త‌న‌తో జ‌రిగిన ప్రేమ వ్య‌వ‌హారం గురించి ఆమెకు చెబుతాడు. భీమ‌వ‌రంలో ఇంజ‌నీరింగ్ చ‌దివే రోజుల్లో ఆదిత్య, కిర‌ణ్మ‌యిని చూసి ప్రేమ‌లో ప‌డ‌టం, అనుకోకుండా ఆమెతో మ‌న‌స్ప‌ర్ధ‌లు రావ‌డం, విడిపోవ‌డం అన్నీ విష‌యాలు సుమ కు పూస గుచ్చి నట్టు చెప్పేస్తాడు. ఆదిత్య ప్రేమ‌లోని నిజాయితీని చూసిన సుమ అత‌నితో ప్రేమ‌లో ప‌డుతుంది. అయితే కిర‌ణ్మ‌యిని మ‌ర‌చిపోలేని ఆదిత్య నిజం చెప్పేయాల‌ని ఆమెను క‌ల‌వ‌డానికి వ‌స్తాడు. కానీ అక్క‌డ ఆదిత్య‌కు అనుకోని షాక్ త‌గులుతుంది.ఆ షాక్ ఏంటి? అస‌లు ఆదిత్య‌కు, కిరణ్మ‌యి మ‌ధ్య గొడ‌వేంటి? చివర‌కు ఆదిత్య త‌న ప్రేను గెలుచుకుంటాడా? మ‌జ్నులా ఉండిపోతాడా? ఇద్దరిలో ఎవరిని ఇష్టపడతాడు అనే మిగతా విషయాలే మిగతా కథ.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్ :

హీరో నాని గత చిత్రాలలో మాదిరిగానే తన సహజ నటనతో అలరించాడు. సినిమా ని ఇంకాస్త పై స్థాయికి తీసికెళ్ళడానికి నాని చాలా దోహదపడ్డాడు. ముఖ్యంగా తన మాజీ గర్ల్‌ఫ్రెండ్ కిర‌ణ్మ‌యి మొదటి ప్రేమ కథలో అయితే అతడు జీవించాడనే చెప్పాలి. కథ తో పాటు కామెడి పండిచండంలో త‌న‌దైన టైమింగ్‌తో అల‌రించాడు. స్వతహాగా నాని పండించిన హాస్యం బాగున్నాయి. అలాగే ఎమోష‌నల్ సీన్స్‌లో కూడా చ‌క్క‌గా న‌టించాడు. హీరోయిన్స్ అను ఇమ్మాన్యుయ‌ల్‌, ప్రియాశ్రీ న‌ట‌న పెద్ద ఎఫెక్టివ్‌గా అనిపించ‌లేదు. లుక్ ప‌రంగా కూడా ఇద్ద‌రు హీరోయిన్స్ చాలా తేలిపోయారు. సెకండ్ హాఫ్ లో వచ్చే వెన్నెల కిశోర్ కామెడీ, ముంబైలో తెలుగు వ‌చ్చినా రాకుండా మెనేజ్ చేసే క్యాబ్ డ్రైవ‌ర్ పాత్ర‌లో కామెడి న‌వ్విస్తుంది. నాని ఫ్రెండ్ పాత్ర‌లో న‌టించిన స‌త్య త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. రాజ్‌త‌రుణ్ గెస్ట్ అప్పియ‌రెన్స్ చెప్పుకోనేంత విధంగా లేదు. రాజ‌మౌళి రెండు, మూడు సీన్స్‌లో మెర‌వ‌డం విశేషం.

సాంకేతిక వర్గం :

కథ పాతదే అయినా కథానాన్ని కొత్తగా రాసుకుని దాన్ని తెరపై అందంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విరించి వర్మ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా మొదటి భాగాన్ని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. గత సినిమా ‘ఉయ్యాలా జంపాల’ పెద్ద బ్యానర్ లో చేయడం తో నిర్మాతల ప్రమేయంతో ఆ సినిమా ను తీయగలిగాడు అనే పుకార్లు వచ్చాయి. కానీ ఈ మూవీ చూస్తుంటే ఆధ్యంతం దర్శకుడి ప్రతిభ పూర్తిగా కనపడింది. ఈ సినిమా కి మరో హైలెట్ జ్ఞాన శేఖర్ అందించిన సినిమాటోగ్రఫీ, అయితే ప్రతి ఫ్రేమ్ చాలా క్లీన్ గా, అందంగా ఉంటూ ఎంజాయ్ చేసే విధంగా ఉంది. ముఖ్యంగా భీమవరం బ్యాక్ డ్రాప్ లో నడిచే లవ్ స్టోరీని ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా, మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చేలా తెరపై చూపించాడు. అలాగే గోపి సుందర్ అందించిన సంగీతం బాగుంది. పాత్రల మధ్య నడిచే మాటల సంభాషణ లు ఆహ్లాదకరంగా వున్నాయి. ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ బ్యానర్ పాటించిన నిర్మాణ విలువలు చాలా గొప్పగా ఉన్నాయి.

విశ్లేష‌ణః

మంచి కథనం, హాస్యంతో సరదగా సాగిపోయే ప్రేమ కథా చిత్రమే ఈ ‘మజ్ను’. అందమైన ఫస్ట్ హాఫ్ లవ్ స్టోరీ, మంచి టైమింగ్ తో సాగే కామెడీ, అద్బుతమనిపించే హీరో నాని నటన, అందమైన సినిమాటోగ్రఫీ, సంతృప్తినిచ్చే క్లైమాక్స్ ఈ చిత్రంలోని ప్లస్ పాయింట్స్ కాగా కాస్త బోర్ కొట్టించే సెకండ్ హాఫ్ రొటీన్ కథనం, ఊహాజనియమైన ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్, నాని ఎన‌ర్జిటిక్ పెర్‌ఫార్మెన్స్‌తో సినిమా అంత‌టినీ తానై ముందుకు న‌డిపించాడు. అయితే కాస్తా కామెడి డోస్ పెంచి క‌థ‌ను న‌డిపించే ప్ర‌య‌త్నం చేశాడు. ఫ‌స్టాఫ్‌ను ఎంట‌ర్‌టైనింగ్‌తో సాగేలా కేర్ తీసుకున్నాడు. అందువల్ల సెకండాఫ్‌లో ఏదైనా కొత్త‌ద‌నం ఉంద‌నుకునే ప్రేక్ష‌కుడికి కొత్త‌దనం క‌న‌ప‌డ‌దు. త‌న ప్రేమ‌ను ద‌క్కించుకోవ‌డానికి హీరో, హీరోయిన్ మ‌ధ్య స‌న్నివేశాలు అన్నీ మ‌న‌కు వేరే సినిమాల్లోచూసిన విధంగానే క‌న‌ప‌డ‌తాయి. హీరోయిన్స్ అను ఇమ్మాన్యుయ‌ల్‌, ప్రియాశ్రీ ఈ చిత్రానికి మైనెస్ అనే చెప్పాలి. ఫ‌స్టాఫ్‌లోనే నాలుగు సాంగ్స్ ఉండ‌టం కూడా మైన‌స్ అనాలి. కథను గురించి. అన్ని ప్రేమ కథల్లాగే ఇది కూడా మామూలు కథే, ఇందులో పెద్దగా కొత్తదనమేమీ లేదు. మొదటి భాగం మొత్తం అందంగా నడిచి సెకండ్ హాఫ్ మాత్రం రొటీన్ గా సాగుతూ కాస్త బోర్ కొట్టించింది.

మొత్తానికి ఆహ్లాదంగా సాగే ప్రేమ కథా చిత్రాలను కోరుకుంటూ, నాని నటనను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం మంచి వినోదాన్ని, సంతృప్తిని ఇస్తుంది. చివరాఖరికి చెప్పేదేంటంటే….నాని గత చిత్రాల స్థాయిలోనే ఈ చిత్రం అందరిని అలరిస్తుంది.

తెలుగు360.కామ్ రేటింగ్ 3.25/5

బ్యాన‌ర్స్ః ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్‌, కేవా మూవీస్‌
న‌టీన‌టులుః నాని, అను ఇమ్మానుయేల్‌, ప్రియాశ్రీ, వెన్నెల కిషోర్‌, సత్యకృష్ణ, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, సత్య, శివన్నారాయణ, రాజ్‌ మాదిరాజ్‌, కేవశదీప్‌, అనుపమ, మనీషా ఫ్లాష్ క్యారెక్టర్స్ ఎస్ ఎస్ రాజా మౌళి, రాజ్ తరుణ్ లు….
సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్‌ వి.ఎస్,
సంగీతం: గోపీసుందర్‌,
ఎడిటింగ్‌: ప్రవీణ్ పూడి,
నిర్మాతలు : ‘జెమీని’ కిరణ్, గీత గొల్ల,
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విరించి వర్మ,
విడుదల తేదీ : 23.09.2016

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

విజయమ్మ బర్త్‌డే విషెష్ : షర్మిల చెప్పింది.. జగన్ చెప్పాల్సి వచ్చింది !

వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజును వైఎస్ జగన్ గత మూడేళ్లలో ఎప్పుడూ తల్చుకోలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు కూడా పెట్టలేదు. కానీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో జగన్ కు...

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close