వైఎస్‌లా చేయి ఊపానంతే: మ‌మ్ముట్టి

ఈనెల 8న `యాత్ర‌` విడుద‌ల అవుతోంది. వై.ఎస్‌.ఆర్ చేసిన `పాద యాత్ర‌` ఆధారంగా తెర‌కెక్కించారు. వైఎస్ పాత్ర‌లో మ‌మ్ముట్టి న‌టించిన సంగ‌తి తెలిసిందే. మ‌మ్ముట్టి చాలా పెర్‌ఫెక్ష‌నిస్ట్‌. ఏ పాత్ర ఇచ్చినా… దానికి నూటికి నూరుపాళ్లూ న్యాయం చేసేంత వ‌ర‌కూ వ‌ద‌ల‌రు. వైఎస్ పాత్రకి మ‌మ్ముట్టి త‌ప్ప ఇంకెవ్వ‌రూ న్యాయం చేయ‌లేరేమో అని ప్ర‌చార చిత్రాలే చాటి చెబుతున్నాయి. వెండి తెర‌పై ఆయ‌న ఆ పాత్ర‌లో ఎంత‌గా ఒదిగిపోయారో చూడాలి.

మ‌రి వైఎస్ పాత్ర కోసం మ‌మ్ముట్టి చేసిందేమిటి? ఆయ‌న‌లా క‌నిపించ‌డానికి ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు? – వీటిపై మ‌మ్ముట్టి మ‌న‌సు విప్పారు.

”వైఎస్ ఆర్ లా క‌నిపించ‌డం ఎవ‌రికీ సాధ్యం కాదు. అందుకే నేనూ ప్ర‌య‌త్నించ‌లేదు. కేవ‌లం ఆయ‌న‌లా చేయి ఊపానంతే. అలా ఎవ‌రు చేయి ఊపినా వైఎస్ లానే క‌నిపిస్తారు. ఆయ‌న గొంతుని కూడా మిమిక్రీ చేయ‌డానికి ప్ర‌య‌త్నించ‌లేదు. నాలా నేను మాట్లాడా. వైఎస్ ఆత్మ‌కి మాత్ర‌మే తీసుకున్నాం. ఉన్న‌ది ఉన్న‌ట్టుగా చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించ‌లేదు కాబ‌ట్టి, మా ప‌ని కాస్త సుల‌భ‌మైంది” అని చెప్పుకొచ్చారు మ‌మ్ముట్టి. అయితే ఈ సినిమా చేయ‌క‌ముందు వై.ఎస్‌.ఆర్ గురించి ఆయ‌న‌కేమాత్రం తెలీద‌ట‌. ఈ సినిమా ఒప్పుకున్న‌ప్పుడే వైఎస్ ఆర్ గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశార‌ని చెబుతున్నారు. అంతేకాదు.. వైఎస్ కుటుంబ స‌భ్యుల్నీ తాను క‌ల‌వ‌లేద‌ని క్లారిటీ ఇచ్చేశారు మ‌మ్ముట్టి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close