మీడియా వాచ్ : బార్క్‌ రేటింగ్స్‌లో చానల్స్ చేసింది అద్భుతాలా ? అక్రమాలా ?

బార్క్ ప్రకటించిన తెలుగు న్యూస్ చానల్స్ రేటింగ్స్ కామెడీ అయిపోయాయి. రియాలిటీకి ఎక్కడా దగ్గరగా లేకపోవడంతో నెంబర్ వన్ అని సంతోషపడుతున్న చానల్స్ ఉద్యోగులు కూడా కామెడీ చేసుకుంటున్నారు. రేటింగ్స్ ట్యాంపర్ చేస్తున్నారన్న కారణంగా కేసులు నమోదు కావడంతో న్యూస్ చానల్స్‌కు బార్క్ చాలా కాలం పాటు రేటింగ్‌లు నిలిపివేసింది. వివిధరకాల పరిణామాల తర్వాత కేంద్ర సమాచార శాఖ జోక్యం చేసుకుని న్యూస్ చానళ్లకు రేటింగ్‌లు ఇవ్వాలని ఆదేశించింది. దీంతో బార్క్ మళ్లీ రేటింగ్‌లు ఇవ్వడం ప్రారంభించారు.

ఎన్టీవీ ఈ మధ్య కాలంలో చేసిన అద్భుతాలేమున్నాయని అంత రేటింగ్స్ !?

ఇటీవల బార్క్ రేటింగ్స్ ప్రకటించింది. ఈ రేటింగ్‌లు చూసి అందరికీ మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఎందుకటే ఎన్టీవీ న్యూస్ చానల్ ఎవరికీ అందనంత ఎత్తులో ఉండిపోయింది. రెండో స్థానంలో ఉన్న టీవీ9 కి మొదటి స్థానంలో ఉన్న ఎన్టీవీకి తేడా 20 పాయింట్లకుపైగా ఉంది. ఇదెలా సాధ్యమో మీడియాలో పండిపోయిన వారికీ అర్థం కాలేదు. ఇటీవలి కాలంలో ఎన్టీవీ ప్రజా ఉద్యమాలు చేసిందా.. వారి ఇళ్లలోకి చొచ్చుకుపోయే కార్యక్రమాలు చేసిందా అని చాలా మంది ఆలోచించారు. కానీ అలాంటివేమీ కనిపించలేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అనుకూల వార్తలు ఇస్తూ బాధితుల పక్షమే నిలబడటం మానేశారు. అదే సమయంలో మరి టెక్నికల్‌గా ఏమైనా గొప్ప మార్పులు తెచ్చి విజువల్ వండర్స్ చూపిస్తున్నారా అంటే అదీ లేదు. అసలు అత్యంత సాదాసీదాగా సాగిపోతున్న న్యూస్ చానల్స్‌లో ఎన్టీవీ అగ్రభాగంలో ఉంది. మరి ఆ చానల్‌కు రేటింగ్స్ ఎలా వచ్చాయి..?

వనిత టీవీని అంత మంది చూస్తున్నారా ? నిజంగానే !?

సరే అనుకుంటే ఆ చానల్ గ్రూప్‌లో ఉన్న రెండు ఉనికి లేని చానల్స్ ఉన్నాయి. ఒకటి భక్తి.. రెండు వనిత. భక్తి చానల్‌కు… దీపోత్సవం లాంటివి పెట్టినప్పుడు కాస్త రేటింగ్స్ వస్తాయి.. మిగిలిన రోజుల్లో చాలా పరిమితమైన ఆడియన్స్ ఉంటారు. ఇక వనిత చానల్‌కు అసలు వ్యూయర్ షిప్ ఉన్నట్లుగా ఎవరూ అనుకోరు. కానీ అనూహ్యంగా ఈ గ్రూప్‌లోని భక్తి, వనిత చానళ్లకు రేటింగ్‌లు పెరిగిపోయాయి. అంటే ఎన్టీవీ గ్రూప్‌లోని మూడు చానళ్లకు రేటింగ్‌లు భారీగా పెరిగిపోయాయి. ఇవి రేటింగ్‌లు ఆపేయాడనికన్నా ముందు రేటింగ్‌లతోపోలిస్తే అసాధారణంగా ఉన్నాయి. గ్రాడ్యూయల్‌గా పెరిగితే ఇలా వచ్చే అవకాశం అలేదు. అద్భుతమో.. అక్రమమో చేస్తేనే సాధ్యం. అద్భుతాలు చేయలేదు కాబట్టి అక్రమం అనే ఆరోపణలు రావడానికి కారణం అవుతోంది.

నమ్మలేని రేటింగ్‌లొస్తే మొదటికే మోసం ! కూర్చున్న కొమ్మను నరక్కున్నట్లే !

రేటింగ్ మీటర్లు తిప్పుతున్నారనేది చాలా కాలంగా ఉన్న అభియోగాలు ఉన్నాయి. ఈ అనుమానాలు చాలా చానళ్లపై ఉన్నాయి. గతంలో స్టింగ్ ఆపరేషన్లు కూడా వెలుగు చూశాయి. టీవీ9 మీద కూడా లెక్క లేనన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అవి ఎన్టీవీ గ్రూప్ మీద వస్తున్నాయి. అసాధారణంగా ఫలితాలు వస్తే ఇదే విధంగా అనుమానాలు వస్తాయి. బార్క్ రేటింగ్‌లు మళ్ళీ ఇవ్వాలని నిర్ణయించిన తర్వాత పాత వ్యూహాలను మళ్లీ అమలు చేశారనే అనుమానాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. వీటిని ఎవరూ నివృతి చేయలేరు. కానీ రేటింగ్స్‌పై నమ్మకం పోతుంది. పరిస్థితి ఇలాగే ఉంటే రేటింగ్‌ల వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందని చానల్స్ అనుకుంటాయో.. ఆప్రయోజనాలు కూడా రాకుండా పోయే ప్రమాదం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close