ఇంగ్లిష్ వర్సెస్ మతం..! మంత్రులకు ఇంత కంగారెందుకు..?

తెలుగు మీడియంను పూర్తిగా రద్దు చేసి.. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క ఇంగ్లిష్ మీడియంను మాత్రమే కొనసాగించాలని… జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు….కానీ.. తెలుగు మీడియం రద్దును మాత్రం ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయం వెనుక మత వ్యాప్తి కోణం ఉందన్న సందేహాం సామాన్య జనంలోకి వచ్చేసింది. దీనిపై భుజాలు తడుముకుంటున్నట్లుగా.. ఏపీ సర్కార్.. వ్యవహారశైలి ఉంది. మతకల్లోలాలు రేపేందుకు కుట్ర జరుగుతోందంటూ.. కొత్త వాదన వినిపిస్తున్నారు. ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి.. ఆంధ్రజ్యోతి పత్రికలో హిందూస్ వర్సెస్ క్రిస్టియన్స్ అనే కథనం రాశారని మండిపడ్డారు. మతమార్పిడి కోసమే ఏపీలో ఇంగ్లీష్ మీడియంను పెడుతున్నారని.. ప్రధాని మోడీకి కూడా వేమూరి రాధాకృష్ణ చెప్పినట్టున్నారని విచిత్రమైన లాజిక్‌ను కూడా వినిపించారు.

మోడీ ప్రస్తావన మంత్రి ఎందుకు తెచ్చారో చాలా మంది జర్నలిస్టులకు అర్థం కాలేదు. బహుశా… ఇంగ్లిష్ మీడియం విషయంలో వివరణ కోరుతూ.. కేంద్రం నుంచి ఏమైనా.. లేఖ వచ్చిందేమో.. అన్న చర్చ … సెక్రటేరియట్‌లో నడుస్తోంది. మరో మంత్రి అవంతి శ్రీనివాస్.. మరో చిత్రమైన లాజిక్ ను వినిపించారు. భారతీయ జనతా పార్టీ, ఆరెస్సెస్ నుంచి తమను దూరం చేయడానికే.. ఇంగ్లిష్ మీడియం.. క్రిస్టియానిటీ వ్యాప్తికని ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. అసలు బీజేపీ, ఆరెస్సెస్‌తో వైసీపీ అంత దగ్గరగా ఎప్పుడు ఉందో… అవంతి శ్రీనివాసే చెప్పాల్సి ఉంది. ఎప్పుడూ… బీజేపీతో వైసీపీ పొత్తులు పెట్టుకోలేదు. కనీసం కలిసి పనిచేయలేదు. పైగా మెడలు వంచుతామంటూ… నిన్నామొన్నటి వరకూ.. ముఖ్యమంత్రి నుంచి ఎంపీల వరకూ మాట్లాడారు. ఇప్పుడు హఠాత్తుగా.. సంబంధాలు కలిపేసుకుంటున్నారు అవంతి శ్రీనివాస్.

గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్న చందంగా… వైసీపీ మంత్రుల తీరు ఉందన్న విమర్శలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి. దీన్ని కవర్ చేసుకోవడానికి ఇంగ్లిష్ మీడియాన్ని వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ… ఇంగ్లిష్ మీడియంను గతంలో వ్యతిరేకించింది.. వైసీపీనే…అన్న విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా తడబడుతున్నారు. ఇప్పుడు తెలుగును.. లేకుండా చేయాలనుకున్న నిర్ణయాన్నీ సమర్థించుకోలేకపోతున్నారు…

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అయితే పోతిన లేకపోతే పోసాని – పిచ్చెక్కిపోతున్న వైసీపీ !

పవన్ కల్యాణ్ రాజకీయంతో వైసీపీకి దిక్కు తోచని పరిస్థితి కనిపిస్తోంది. ఆయనపై కసి తీర్చుకోవడానికి వ్యక్తిగత దూషణలు.. రూమర్స్ ప్రచారం చేయడానికి పెయిడ్ ఆర్టిస్టుల్ని ప్రతీ రోజూ రంగంలోకి తెస్తున్నారు. గతంలో పోసాని...

టాలీవుడ్ మార్కెట్ పెంచుకుంటున్న కన్నడ స్టార్

ఈ మధ్య భాషా బేధాలు లేకుండా అన్ని భాషలకి చెందిన సూపర్ స్టార్స్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే క్రేజీ కాంబినేషన్స్ వర్కౌట్ అవుతున్నాయి. కోలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్...

కేసీఆర్ కు ఏమైంది..?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రసంగం అనగానే తెలంగాణ ప్రజలంతా చెవులు రిక్కించి వినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇదంతా గతం. అధికారం కోల్పోయాక ఆయన ప్రసంగంలో మునుపటి వాగ్ధాటి కనిపించడం లేదనే అభిప్రాయాలు...

బొత్స తండ్రి సమానుడా ? : షర్మిల

వైఎస్ జగన్ బొత్సను తన తండ్రి సమానుడు అని అనడం.. ఆయన విచిత్రమైన హావభావాలతో కంట తడిపెట్టుకున్నట్లుగా నటించడం, తర్వాత కాళ్లకు దండం పెట్టే ప్రయత్నం చేయడం విజయనగరం సిద్ధం సభలో కనిపించిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close