ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చారు కానీ బిల్లులో లేదని ఇవ్వలేదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లోక్ సభలో డీలిమిటేషన్ చర్చలో వ్యాఖ్యనించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును.. అలాగే పునర్విభజన బిల్లును స్వాగతిస్తున్నామని ముందుగానే చెప్పిన ఆయన ఆ తర్వాత ..సంబంధం లేనిఅంశాలను మాట్లాడారు. అందులో ప్రత్యేకహోదా కూడా వచ్చింది. ప్రత్యేకహోదా ఇవ్వలేదని చెప్పారు కానీ.. ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని ఒక్క మాట కూడా చెప్పలేదు.
ఎప్పటికైనా పడి ఉంటుందిలే అన్నట్లుగా సంబంధం లేని అంశాలన్నింటిని తన ప్రసంగంలో మిథున్‌రెడ్డి చదువుకుంటూ పోయారు. టీడీపీ ఎంపీ శబరి గత వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలను చెప్పారని.. మిథున్‌రెడ్డి ఇప్పుడు సాక్షిలో వస్తున్న కూటమి ఎమ్మెల్యేలపై ఆరోపణలను ప్రస్తావించారు. నియోజకవర్గాల పునర్విభజన .. రాష్ట్ర స్థాయిలోనూ ప్రాంతాల వారీగా న్యాయంజరగాలని కూడా వాదించారు.
మిథున్ రెడ్డికి ఏం మాట్లాడారో స్క్రిప్ట్ అంతా తాడేపల్లి నుంచే వస్తోంది. వ్యూహాత్మకంగానే ఆయన ప్రత్యేకహోదా ను ప్రస్తావించారని అనుకోవచ్చు. గతంలో హోదా పేరుతో ప్రజల్ని మోసం చేశారు. మరోసారి అలా మోసం చేయవచ్చేమో టెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీకి ఎక్కడ కోపం వస్తుందో అని హోదా ఇవ్వాలని మాత్రం అడగలేదు.
