ఓ రాష్ట్రాధినేత వేదన ప్రధానికి పట్టదా..!?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవేదనను ప్రధాని మోడీ పట్టించుకోవడం లేదు. కృష్ణాజలాలను తెలంగాణ వాడేస్తోందని.. అడ్డుకోవాలని ఆయన అదే పనిగా ప్రధానికి.. మంత్రులకు.. కేఆర్ఎంబీకి లేఖలు రాస్తున్నా… స్పందన ఉండటం లేదు. ప్రధాని పట్టించుకోకపోయినా లేఖల మీద లేఖలు రాస్తున్న సీఎం జగన్ … ఇప్పటికైనా స్పందిస్తారేమోనని ఆశ పడుతున్నారు. తెలంగాణ సర్కార్ జలవిద్యుత్ ఉత్పత్తి ఆపకపోవడంతో ప్రధానికి ఈ సారి మరింత సుదీర్ఘమైన లేఖను రాశారు. కేఆర్ఎంబీ పరిధిని వెంటనే నోటిఫై చేయాలని కోరారు. రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించిన.. అధికారులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావాలని విజ్జప్తి చేశారు.

ఈ సారి లేఖల ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం 2014ను ప్రస్తావించారు. లేఖలోతెలంగాణపై జగన్ పలు ఆరోపణలు చేశారు. కృష్ణా నదిలోని కామన్ రిజర్వాయర్లలో.. నిబంధనల్ని తెలంగాణ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని.. పునర్‌విభజన చట్టాన్ని తెలంగాణ గౌరవించడం లేదన్నారు. పదేపదే జలశక్తి శాఖ, కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసినా వివాదాలు పరిష్కారం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి లేఖపై.. అటు కేంద్రంలోనూ ఇటు తెలుగు రాష్ట్రాల్లోని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతా జగన్ స్వయంకృతాపరాథమేనని తేల్చేస్తున్నారు. కేసీఆర్‌తో రాజకీయంగా మంచి సంబంధాలు నెలకొల్పుకుని రాష్ట్రం కోసం ప్రధానికి లేఖలు రాస్తే ఏం ప్రయోజనం ఉంటుందని అంటున్నారు.

విభజన చట్టంలో ఏపీకి రావాల్సినవి.. వదిలేసినవి ఏపీ సీఎంకు గుర్తు లేరు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి ఆస్తుల పంపకం గురించి ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు. దాదాపుగా ఏపీకి రావాల్సిన ఏడు వేల కోట్ల కరెంట్ బకాయిల గురించీ ఒత్తిడి తీసుకు రాలేదు. గత ప్రభుత్వం తెలంగాణ విద్యుత్ సంస్థలపై దివాలా పిటిషన్ వేసింది. ఎన్సీఎల్టీలో కేసు విచారణకు రాగానే.. ఈ ప్రభుత్వం ఆ పిటిషన్ ఉపసంహరించుకుంది. కానీ నిధులు మాత్రం అడగలేదు. ఇప్పుడు కూడా… కృష్ణా నీరంతా సముద్రం పాలవుతూంటే లేఖలతో టైంపాస్ చేస్తున్నారు. ఇద్దరు మిత్రులు రాజకీయం చేసుకుంటున్నారన్న అభిప్రాయంలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్లుగా చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కేంద్రం జోక్యం చేసుకునే పరిస్థితి లేదని.. వారే పరిష్కరించుకోవాలని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close