నాలుగేళ్లలో మోహన్‌బాబు కాలేజీలకు రూ. 90 కోట్లు ..! ఎన్నికల ర్యాలీలెందుకు..?

విద్యానికేతన్ పేరుతో విద్యాసంస్థలు నిర్వహిస్తున్న మోహన్ బాబు.. ప్రభుత్వం నుంచి ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు రాలేదంటూ.. తన కాలేజీలో చదివే విద్యార్థులతో.. ఏకంగా ర్యాలీ చేయడానికి ప్రయత్నించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని.. అలాంటి ర్యాలీలు చేయకూడదని.. మోహన్ బాబుకు తెలిసినా.. కావాలనే.. మీడియాలో కాస్త హడావుడి చేయాడానికి ఆయనీ ప్రయత్నం చేశారని రాజకీయవర్గాలు ఎవరికైనా అర్థం అయిపోతుంది. తన కాలేజీలకు నాలుగేళ్ల కాలం నుంచి ఒక్క రూపాయి కూడా ఫీజు రీఎంబర్స్‌మెంట్ రాలేదని.. ఇప్పటికి రూ. 19 కోట్లు రావాలని ఆయన చెబుతున్నారు. కొద్ది రోజుల కిందట కూడా.. మోహన్ బాబు ఇలాంటి ఆరోపణలు చేశారు. ఆ సమయంలోనే ఏపీలో ప్రైవేటు కాలేజీల అసోసియేషన్… ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లిస్తున్నందుకు.. కృతజ్ఞతలు చెబుతూ ఓ లేఖ రాసింది. ఆ విషయం మీడియాలోనూ హైలెట్ అయింది.

అయితే.. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు ప్రచార బరిలోకి దిగిన తర్వాత.. ప్రభుత్వం ఇప్పుడు ఓ రకంగా ఈసీ పర్యవేక్షణలో నడుస్తుందని తెలిసి కూడా.. మోహన్ బాబు రంగంలోకి దిగారు. తన కాలేజీ విద్యార్థులతో ర్యాలీ ప్రారంభించారు. కానీ తెలుగుదేశం పార్టీ వెంటనే కౌంటర్ ఇచ్చారు. ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు.. కుటుంబరావు… మోహన్ బాబుకు చెందిన నాలుగు విద్యా సంస్థలకు.. నాలుగేళ్లలో ఇచ్చిన ఫీజు రీఎంబర్స్‌మెంట్ నిధుల గురించి పూర్తి వివరాలు విడుదల చేశారు. నాలుగేళ్లలో… మోహన్ బాబుకు చెందిన నాలుగు విద్యాసంస్థలకు రూ. 95 కోట్లు ఫీజు రీఎంబర్స్‌మెంట్ కింద కేటాయించారు. ఇందులో రూ. 88 కోట్లకుపైగా చెల్లించారు. ఇంకా రూ. ఆరు కోట్లకు అటూ ఇటుగా చెల్లించాల్సి ఉంది. ఇది చెల్లించాల్సిన గడువు ఈ ఏడాది చివర. అంటే.. ఒక్కరూపాయి కూడా ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు లేకుండానే… విద్యార్థులను రెచ్చగొట్టి మోహన్ బాబు.. రాజకీయ ర్యాలీకి ప్రయత్నించారు.

నాలుగేళ్ల నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని.. మోహన్ బాబు చెప్పడం పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని.. టీడీపీ నేతలు మండి పడుతున్నారు. రాష్ట్రంలో ఉన్న కాలేజీలన్నింటికీ వచ్చి.. మోహన్ బాబు కాలేజీలకు ఎందుకు రాదని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో.. ఈ వివరాలు ప్రకటించిన కుటుంబరావు .. మోహన్ బాబుకు చర్చకు రావాలని సవాల్ చేశారు. తన విద్యాసంస్థల్లో ఇరవై ఐదు శాతం విద్యార్థులకు ఉచితంగా చదువు చెబుతున్నానని మోహన్ బాబు ప్రచారం చేసుకుంటున్నారని..కానీ ప్రతీ విద్యార్థికి ఫీజు రీఎంబర్స్‌మెంట్ క్లెయిమ్ చేసుకుంటున్నారని మండి పడ్డారు. అదే సమయంలో.. గతంలో తన విద్యాసంస్థల్లో ఇరవై ఐదు శాతం మందికి ఉచితంగా చదువు చెబుతున్నానని.. ఎన్నారైల దగ్గర విరాళాలు సేకరించిన వ్యవహారం కూడా బయటకు వచ్చింది. దానికి లెక్కలు చెప్పాలని.. ఆ ఈవెంట్లను ఆర్గనైజ్ చేసిన వాళ్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ సమయంలో ప్రభుత్వంపై చేసే ప్రతీ ఆరోపణ రాజకీయ కోణం కిందనే వస్తుందనే సంగతిని మోహన్ బాబు మర్చిపోయారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మంచు మోహన్ బాబుకు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తనకూ ఓ రోల్ సృష్టించుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అవి సొంతంగా చేస్తున్నారా.. మరెవరైనా చేయిస్తున్నారా.. అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉందని టీడీపీ నేతలు అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close