తాజా జేమ్స్‌బాండ్ చిత్రంలో హీరోయిన్‍‌గా 51 ఏళ్ళ నటి!

హైదరాబాద్: 51 ఏళ్ళ ఇటాలియన్ ప్రౌఢ నటి మోనికా బెల్లూస్సి ఒక కొత్త రికార్డ్ సృష్టించబోతున్నారు. ఇప్పటివరకు రూపొందిన 24 జేమ్స్‌బాండ్ చిత్రాలలో హీరోయిన్‌గా నటించిన నటీమణులందరిలో పెద్దదిగా రికార్డులలోకెక్కబోతున్నారు. ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న స్పెక్ట్ర్‌లో డేనియల్ క్రెగ్ సరసన హీరోయిన్‌గా మోనికా నటించారు.

మన హీరోయిన్‌లు నిద్రలో లేపి సడన్‌గా అడిగినా వయస్సు చెప్పరు. కానీ హాలీవుడ్‌లోమాత్రం వయస్సు దాచుకోవటం ఉండదు. వయస్సును బాహాటంగా ప్రకటిస్తారు. 50 ఏళ్ళ వయసులో కూడా హీరోయిన్‌లుగా ప్రేక్షకులను అలరిస్తారు. ప్రముఖ నటీమణులు ఎలిజబెత్ హర్లీకి 50, హేల్లీ బెర్రీకి 49, జెన్నిఫర్ అనిస్టన్‌కు 46, జూలియా రాబర్ట్స్‌కు 48, నికొల్ కిడ్‌మన్‌కు 48, సల్మాహయెక్‌కు 49, శాండ్రా బుల్లక్‌కు 51, జోడీ ఫాస్టర్‌కు 52 ఏళ్ళు ఉన్నాయి. ఈ వయసులోకూడా వీరు తమ శరీర సౌష్ఠవాన్ని చక్కగా మెయింటెయిన్ చేయటం ఒక విశేషం. మోనికా కూడా ఈ కోవలోనివారే. మామూలుగా జేమ్స్‌బాండ్ చిత్రాలలో హీరోయిన్‌లను బాండ్ గాళ్ అని పిలుస్తారు. తాను బాండ్ గాళ్ అనే పదానికి సరిపోయేంత చిన్నదానినికాదని, తనను బాండ్ వుమన్ అని పిలవమని మోనికా కోరారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close