మంత్రులు, ముఖ్యమంత్రిపై రాయపాటి అసంతృప్తి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బ తినబోతోందని గ్రహించి ఆ పార్టీతో ఉన్న దశాబ్దాల అనుబంధాన్ని పుటుక్కున త్రెంచేసుకొని తెదేపాలో చేరిన కాంగ్రెస్ నేతలలో రాయపాటి సాంభశివరావు కూడా ఒకరు. పార్టీలో చేరుతూనే నరసరావుపేట ఎంపి సీటును దక్కించుకొన్నారు కూడా. కానీ ఆయన తరచూ పార్టీపై ఏదో రూపంలో అసంతృప్తి వెలిబుచ్చుతూనే ఉన్నారు.

గురువారంనాడు గుంటూరుజిల్లా ప్రతిప్పాడు మండలంలో గొట్టిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠాశాల స్వర్ణోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆయన మాట్లాడుతూ “మన జిల్లాలో గురజాల, వినుకొండ, మాచర్ల నియోజకవర్గాలు తెలంగాణ, రాయలసీమ కంటే చాలా వెనుకబడి ఉన్నాయి. ప్రజలకి త్రాగడానికి నీళ్ళు కూడా దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారని నేను మంత్రులకు చెపితే వారు పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి రోజుకి 18 గంటలు కష్టపడుతున్నారు. కానీ మంత్రులు మాత్రం ప్రజా సమస్యల పరిష్కరించేందుకు చొరవ చూపడం లేదు. అసలు మంత్రుల మధ్య సమన్వయమే లేదు. శంఖుస్థాపనలు చేసి శిలాఫలకాలపై పేర్లు వేసుకోవడంపై ఉన్న శ్రద్ద ఆ పనులు చేపట్టడంలో కనిపించదు. రైల్వే జోన్ గురించి గట్టిగా మాట్లాడుదామంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దని కోపడుతుంటారు. పార్టీలో ఇమడలేక చాలా ఇబ్బందిగా ఉంది. కానీ ఏమి చేస్తాం తప్పదు కదా…” అని అన్నారు.

తెదేపాలో ఒకరిద్దరు మంత్రులు తప్ప మిగిలినవారి పనితీరు బాగోలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశాలలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అదే విషయాన్నీ ఇప్పుడు రాయపాటి సాంభశివరావు నోటి ద్వారా మరోసారి బయటపడింది. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత కోసమే చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి, రైల్వే జోన్ వంటి హామీల గురించి గట్టిగా అడగడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు రాయపాటి కూడా వారి ఆరోపణలను దృవీకరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం సహాయ సహకారాలు చాలా అవసరం కనుక కేంద్రంతో సఖ్యతగా మెలగడం మంచిదే. కానీ దాని వలన రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం జరుగుతున్నపుడు కూడా ఎంపిలని మాట్లాడనీయకుండా కట్టడి చేసినట్లయితే, చివరికి తెదేపా, బీజేపీలు రెండూ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. వచ్చే ఎన్నికలలోగా రాజధాని ప్రాధమిక దశ నిర్మాణం పూర్తి చేయడం, పోలవరం పూర్తి చేయడం, వైజాగ్, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణం, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి చేయడం, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని మళ్ళీ గాడిన పెట్టడం వంటి పనులన్నీ పూర్తి చేస్తానని చంద్రబాబు నాయుడు చాలాసార్లు చెప్పుకొన్నారు. అప్పుడే దాదాపు రెండేళ్ళ కాలం పూర్తి కావస్తోంది కానీ ఇంతవరకు ఆయన చెప్పినవాటిలో ఏ ఒక్కపనీ పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. అలాగే ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి, రైల్వే జోన్ వంటి హామీలపై మాట తప్పినందుకు బీజేపీ కూడా వచ్చే ఎన్నికలలో మూల్యం చెల్లించవలసి రావచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close