ఫ్యూచర్ సిటీలో ప్రారంభమైన తెలంగాణ రైజింగ్ సమ్మిట్ లో నాగార్జున ప్రధాన ఆకర్షణగా నిలిచారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంట ఆయన ఫ్యూచర్ సిటీకి వచ్చారు. అక్కడ ముఖ్యమంత్రితో కలిసి స్టాల్స్ పరిశీలించారు. ఈ సందర్భంగా నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ ని కూడా ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తాంమని ప్రకటించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొనడం సంతోషంగా ఉందిని.. ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్ నేను చదివాను, చాలా అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఇక్కడ ఒక ఫిలిం హబ్ ని కూడా తయారు చేయాలని చర్చలు జరుగుతున్నాయని..అన్నపూర్ణ స్టూడియోస్ ని కూడా ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తామన్నారు.
అయితే కొత్తగా ప్యూచర్ సిటీలో అన్నపూర్ణ స్టూడియోను నిర్మిస్తారా లేకపోతే.. పూర్తిగా బంజారాహిల్స్ నుంచి తరలిస్తారా అన్నది క్లారిటీ లేదు. అన్నపూర్ణ స్టూడియోను నిర్మించినప్పుడు అవి కొండలు, గుట్టలు, అతి కష్టం మీద నిర్మాణాలను పూర్తి చేశారు. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో అత్యంత బిజీ ఏరియాల్లో ఒకటి. ఆ ల్యాండ్ వేల కోట్ల ఖరీదు చేస్తుంది. హిల్ట్ పాలసీలో భాగంగా అన్నపూర్ణ స్టూడియోను ఫ్యూచరీ సిటీకి తరలించేలా ఏమైనా ఒప్పందం చేసుకుంటున్నారా అన్నది తెలియాల్సి ఉంది.
హిల్ట్ పాలసీ ప్రకారం.. ప్రభుత్వం .. ఓ పర్పస్ కోసం కేటాయించిన భూములు అంటే.. ఫ్యాక్టరీ లేదా సినీ స్టూడియో వంటి వాటికి కేటాయించిన భూములు వాటికే వినియోగించాలి. ఇతర వాటికి అనుమతి లేదు. అన్నపూర్ణ స్టూడియో.. స్టూడియో నిర్వహణకు మాత్రమే ఆ స్థలంలో వినియోగించాలి. మల్టీ యూజ్ గా ప్రభుత్వం మారిస్తే.. శివారు ప్రాంతానికి స్టూడియో తరలించి.. అక్కడ రియల్ ఎస్టేట్, హోటల్స్ వంటివి చేసుకోవచ్చు. నాగార్జునలో మంచి వ్యాపారి ఉన్నారు. ఆయన ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు.


