చంద్రబాబు సర్కారుపై ‘నమస్తే తెలంగాణ’ సంచలన కథనం

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ పత్రిక ‘నమస్తే తెలంగాణ’ ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం ప్రభుత్వంపై విరుచుకుపడింది. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యం నడుస్తోందని ఆరోపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బావలు, బామ్మరుదులదే హవా అని మండిపడింది. విపక్షం నోరెత్తటం లేదని, దినపత్రికలన్నీ పచ్చ పార్టీకి పక్షపాతం వహిస్తున్నాయని ధ్వజమెత్తింది. తెలంగాణపై మాత్రం టన్నులకొద్దీ విషం కక్కుతున్నాయని ఆరోపించింది. టీడీపీ సర్కారు పాలనలోని ఐదు అంశాలను ఎంచుకుని ‘నమస్తే తెలంగాణ’ ఆరోపణలు గుప్పించింది.

1. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతంలో ఊళ్ళకు ఊళ్ళే జైళ్ళులా మారిపోయాయని నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం ఇచ్చింది. ఆ కథనం ప్రకారం… భీమవరం సమీపంలోని తుందుర్రు గ్రామంవద్ద గోదావరి మెగా అక్వా ఫుడ్ పార్క్ పేరిట ఓ భారీ అక్వా పార్క్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఈ పార్క్‌లో వేల టన్నుల చేపలు, రొయ్యలు తదితర సముద్ర ఉత్పత్తులను శుద్ధి చేస్తారు. ఈ పార్క్ నుంచి వదిలే వ్యర్థాలతో సమీపంలోని గొంతేరు డ్రెయిన్ కలుషితమవుతుంది. పది ఊళ్ళలోని వేల ఎకరాల పొలాలు, రొయ్యల చెరువులు భ్రష్టు పట్టిపోతాయి. మత్స్యపూడి, తిల్లపూడి ప్రతిపాదిత లిఫ్ట్‌లు ప్రశ్నార్థకమవుతాయి. తాగునీరూ కలుషితమవుతుంది. తుందుర్రుతోపాటు జొన్నలగరువు, కంసాలి బేతవాడ, శేరే పాలెం, కొప్పర్రు, పెదపేట, చినపేట తదితర పదిఊళ్ళు ప్రభావితమవుతాయి. ఈ పార్క్ వద్దంటూ ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యమిస్తున్నవారందరినీ అరెస్ట్ చేయాలనే ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. తుందుర్రు, కే.బేతపూడి, జొన్నల గర్వు గ్రామాల పొడవునా గజానికి ముగ్గురు చొప్పున పోలీసులు మోహరించారు. తుపాకులు పట్టుకుని ఇల్లిల్లూ గాలిస్తున్నారు. ప్రజలను బయటికి రానివ్వటంలేదు. యుద్ధం వేళ దేశ సరిహద్దు గ్రామాలలో కనిపించే నిశ్శబ్ద భయం నెలకొంది. నిషేధాజ్ఞలు, ఆంక్షలతో ఆ మూడు గ్రామాలను ఓపెన్ జైలుగా మార్చేశారు.

2. విశాఖ మన్యంలో బాక్సైట్ బాంబు పేలనుందని నమస్తే తెలంగాణ అంటోంది. ఇక్కడ లక్షల కోట్ల విలువైన బాక్సైట్ ఖనిజాన్ని రస్ అల్ ఖైమా(RAK)కు చెందిన అన్‌రాక్ సంస్థకు అప్పనంగా దోచిపెట్టటానికి నాటి సీఎం వైఎస్ ప్రయత్నిస్తే, నాటి విపక్ష నేత చంద్రబాబు కస్సుమన్నారని, అధికారంలోకి రాగానే మాత్రం సైలెంట్‌గా జీవో జారీ చేసి దాదాపు 3,000 ఎకరాలను ఏపీఎండీసీకి అప్పగించి దానిని అన్‌రాక్‌కు బదలాయించే యత్నం చేశారని పేర్కొంది. భారీగా పోలీసు బలగాలు రంగంలోకి దిగినా గిరిజనం కళ్ళల్లో ఆగ్రహం తగ్గకపోవటం చూసి ప్రభుత్వమే వెనక్కు తగ్గి జీపో అమలు చేయబోమని చెప్పిందని రాసింది.

3. నూతన రాజధాని అమరావతి నిర్మాణంకోసం భూసేకరణను కూడా ఈ కథనంలో పేర్కొన్నారు. మూడు పంటలు పండే బంగారంలాంటి భూములన్నీ రైతులంతా స్వచ్ఛందంగా ఇచ్చారని సర్కారు చెబుతోందని, దానికి ఆస్థాన పత్రికలు కూడా వంతపాడతాయని రాశారు. భూమిని ఇవ్వటానికి నిరాకరించే రైతులకు బెదిరింపులు ఎదురవుతున్నాయని, వారి పంట పొలాలను తగలబెడుతున్నారని పేర్కొన్నారు. వేల ఎకరాలను సేకరించిన ప్రభుత్వం మరిన్ని వేల ఎకరాలకోసం మళ్ళీ నోటిఫికేషన్ జారీ చేసిందని రాశారు.

4. రాజధాని పేరిట అమరావతి ప్రాంతంలోనే మొత్తం అభివృద్ధిని కేంద్రీకరిస్తున్నారని ఈ కథనంలోనే పేర్కొన్నారు. ఉత్తర కోస్తా-రాయలసీమ ప్రాంతాలకు చంద్రబాబు చేసిన వాగ్దానాలు గాలిలో కలిసిపోయాయని రాశారు. శ్రీబాగ్ ఒప్పందానికి తూట్లు పడ్డాయని, దీనిమీద సీమ రగిలిపోతోందని పేర్కొన్నారు. తెలంగాణ పోరాటం తరహాలో ప్రత్యేక రాష్ట్రంకోసం పలువురు నేతలు కార్యాచరణకు సిద్ధమవుతున్నారని రాశారు.

5. నటుడు, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రికి వియ్యంకుడు బాలకృష్ణకు చెందిన ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు విజయవాడ విద్యాధరపురంలోని అత్యంత విలువైన ఆర్టీసీ భూమిని కట్టబెట్టటానికి రంగం సిద్ధమైందని కథనంలో పేర్కొన్నారు. ఇక్కడ క్రీడా మైదానం, ఆర్టీసీ ఆసుపత్రి నిర్మించాలని గతంలో అనుకున్నప్పటికీ, బాలకృష్ణ అడిగిందే తడవుగా అద్దెకూడా లేకుండా 33 ఏళ్ళపాటు లీజుకు ఇచ్చేశారని రాశారు. దీని విలువ రు.200 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. బాలయ్య వియ్యంకుడు, విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి కుమారుడు, బీజేపీ నేత కావూరి సాంబశివరావు అల్లుడు అయిన రామారావుకు కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలంలోని జయంతిపురంలో 500 ఎకరాలు కట్టబెట్టారని రాశారు. ఇక్కడ ఎకరం రు.60 లక్షలు పలుకుతుంటే కేవలం లక్ష రూపాయలకే సంతర్పణ చేశారని ఆరోపించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి భూరి విరాళాలు ఇచ్చిన గల్లా జయదేవ్‌కు కడప-తిరుపతి రహదారిపై ఉన్న కరకంబాడి వద్ద రు.45 కోట్ల విలువ చేసే 21.69 ఎకరాల భూమిని రు.5 కోట్లకు ఇచ్చేశారని పేర్కొన్నారు.

ఏపీలో ఇంత జరుగుతున్నా ప్రతిపక్షాలు మాట్లాడటంలేదని, పత్రికలు, ఛానళ్ళు కూడా ఒక్క ముక్క రాయటంలేదని నమస్తే తెలంగాణ ఆరోపించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఊళ్ళకు ఊళ్ళు నిర్బంధాల్లో నలిగి హాహాకారాలు చేస్తుంటే, ప్రజలు పోలీసు తుపాకీ నీడల్లో గడగడ వణుకిపోతుంటే ఎవరూ పట్టించుకోవటంలేదని దుయ్యబట్టింది. తెలంగాణలోమాత్రం మంత్రిపై చెప్పు విసిరి కొమురయ్యను కొమరం భీం వారసుడిలాగా చూపుతున్నారని విమర్శించింది.

ఏది ఏమైనా ‘నమస్తే తెలంగాణ’ పేర్కొన్నట్లు – పోలీసుల నిర్బంధంలో ఊళ్ళకు ఊళ్ళు నిర్బంధంలో నలిగిపోయేటంతే సీన్ అయితే ఏపీలో లేదు. ఆ కథనం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ సిరియా లాగానో, ఈజిప్ట్ లాగానో ఉందన్నట్లు అనిపిస్తుంది. ఆ పత్రిక ప్రచురించిన అంశాలలో కొంత నిజం లేకపోలేదు. అయితే దానిని ఎన్నోరెట్లు ఎక్కువచేసి చూపించే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఎదుటివారు తమపార్టీపై చిలవలు పలవలు చేసి రాస్తున్నారని ఆరోపిస్తున్నారు. వారు సరైన మార్గంలో పోతుంటే ఎదుటివారిని విమర్శించొచ్చు. వారు చేసేదీ అదే అయినప్పుడు ఎదుటివారిని విమర్శించే నైతిక హక్కు ఎక్కడుంటుంది? గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుతున్నట్లవుతుంది.

పైగా ఏపీలో ఇప్పుడు ప్రతిపక్షాలు బలంగా ఉన్నాయి. అధికారపార్టీతో ఢీ అంటే ఢీ అంటున్నాయి. ప్రభుత్వానికి ముచ్చెమటలు పోయిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ‘నమస్తే తెలంగాణ’ రాసినంత సీన్ ఏపీలో ఉంటే ప్రతిపక్షాలు పండగ చేసుకుంటాయి. అసలు ప్రతిపక్షాలు కూడా ఏమీ మాట్లాడటం లేదని ఆ కథనంలో రాశారు. ప్రభుత్వంలో చీమ తలకాయంత తప్పు దొరికినా పట్టుకుని ఆరేద్దామని ప్రతిపక్షాలు చూస్తుండగా, అవి కిమ్మనటంలేదని ‘నమస్తే తెలంగాణ’ రాయటం విడ్డూరంగా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close