నాని సినిమా ఖ‌రారైంది

నాని ప్ర‌స్తుతం ట‌క్ జ‌గదీష్ గా రెడీ అవుతున్నాడు. ఈలోగా మ‌రికొన్ని క‌థ‌లు సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ నేప‌థ్యంలో సుకుమార్ శిష్యుడు శ్రీ‌కాంత్ కి నాని అవ‌కాశం ఇచ్చిన‌ట్టు తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు ఆ సినిమా ఖ‌రారైపోయింది కూడా. ఈ చిత్రాన్ని సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇది వ‌రకు శ‌ర్వానంద్ తో `ప‌డి ప‌డి లేచె మ‌న‌సు` తీశారు. ఇప్పుడు రానాతో `విరాట‌ప‌ర్వం` తెర‌కెక్కిస్తున్నారు. `ట‌క్ జ‌గ‌దీష్‌` అయిన త‌ర‌వాత నాని మ‌రో సినిమా చేస్తారు. ఆ త‌ర‌వాతే.. శ్రీ‌కాంత్ సినిమా మొద‌ల‌వుతుంది. అయితే ఈసినిమా సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. సుకుమార్‌కీ, త‌న నిర్మాణ సంస్థ‌కీ, ఈ సినిమాకీ ఎలాంటి సంబంధం లేదు. ఈ సినిమాకి సుధాక‌ర్ మాత్ర‌మే సోలో నిర్మాత‌. త్వ‌ర‌లోనే ఈ సినిమా పై ఓ అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close