కేంద్రం వైపు లోకేష్‌ చూపు!

Telakapalli-Raviకేంద్ర మంత్రి సుజనా చౌదరిని రాజ్యసభకు తిరిగి నామినేట్‌ చేయకుండా ఆ స్థానంలో తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి,చంద్రబాబు నాయుడు తనయుడైన లోకేష్‌ను పంపించవచ్చనే కథనం రాజకీయ వర్గాలను ఆకర్షించింది. అయితే రాజ్యసభ నామినేషన్లపై వూహాగానం చాలా కాలం నుంచి చలామణిలో వుంది.

గత ఏడాది మే నెలలో నేను సుజనా చౌదరిని 10 టీవీ కోసం ఇంటర్వ్యూ చేసినప్పుడు మలిదఫా నామినేషన్‌ గురించిన కథనాల గురించి అడిగాను. ఆయన పెద్ద సమస్య ఏముంటుందంటూనే, అయినా ఇంకా చాలా కాలం వుంది కదా… అని బదులిచ్చారు. “మంత్రి నారాయణ వంటి వారు ఎక్కువ పాత్ర వహిస్తున్నట్టు కనిపిస్తుంది కదా?” అని అడిగితే “రోజూ రాజధానిలో తిరగాల్సిన అవసరం లేదు కదా” అని సమాధానమిచ్చారు.

మళ్లీ కొన్నాళ్లకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడును ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన దీర్ఘకాలం రాష్ట్రంలో మంత్రిగా చేశాను గనక తనకు రాజ్యసభకు పోవాలనివుందని పునరుద్ఘాటించారు. మళ్లీ ఈ మధ్య మీడియాలో దీనిపై ప్రస్తావన వచ్చింది. తెలుగుదేశంకు ఎక్కువ మంది ఎంపిలను పెంచుకునే అవకాశం వుంది గనక ఇద్దరికీ పోటీ వుండదని భావించారు. అయితే ఇప్పుడు లోకేష్‌ పేరు ముందుకు వస్తే పాత లెక్కలు కాస్త మార్చుకోవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు.

డైరెక్ట్‌ ఐఎఎస్‌

సుజనాచౌదరి ఢిల్లీలో చూపించే ప్రభావాన్ని తెలుగుదేశం నాయకులు చాలామంది జీర్ణించుకోలేకపోతున్నా, ఆయనకు చంద్రబాబు ప్రాధాన్యతనిస్తారు గనుక తెర వెనక వ్యాఖ్యలు చేస్తుంటారు. తాను రోజూ ఎన్టీఆర్‌ ట్రస్టులో హాజరు వేయించుకోవాలని భావించేవాణ్ని కాదని,రాజ్యసభకు వెళ్లాకనే పార్టీ వ్యవహారాల్లో శ్రద్ధ పెంచానని చౌదరి అప్పట్లో వ్యాఖ్యానించారు. మొన్నటి విజయానికి ముందు, బాబు అధికారంలో లేని కాలంలోనే తాను వెంటనడిచానని కూడా సుజనా చౌదరి ఆ ఇంటర్వ్యూలోనే చెప్పారు.

ఏదో ఒక సందర్భంలో కష్టమైన చోట పర్యటించాల్సి వచ్చినప్పుడు ‘డైరెక్ట్‌ ఐఎఎస్‌లుగా వచ్చిన వారికి అలాగే వుంటుంది’ అని చంద్రబాబు అన్నారట కదా అని అడిగితే ‘ఆయన ఏదో అంటూ ఉంటారు.. నాకు ఆయనే నాయకుడు గనక మంచి చెబుతుంటారు’ అన్నట్టు మాట్లాడారు.

ప్రత్యేక హోదా నిధుల మంజూరు విషయంలో ఆయన వ్యాఖ్యలపై కొన్ని విమర్శలు వచ్చినా తర్వాత చంద్రబాబు సర్దుకున్నారు తప్ప చౌదరి వైఖరి పెద్దగా మారింది లేదు. గత కొన్ని మాసాలుగా ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనల్లోనూ కేంద్రానికి సంబంధించిన వ్యవహారాల్లోనూ చౌదరి ప్రముఖంగా కనిపిస్తున్నారు. కార్పొరేట్‌ సంబంధాలకు చాలా ప్రాధాన్యతనిచ్చే బాబు ఆయనను అంత తేలిగ్గా మార్చబోరని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

లోకేష్‌ ఢిల్లీ యోచన సంకేతాలు

ఆ సంగతి ఎలా వున్నా లోకేష్‌ను రాజ్యసభకే గాక కేంద్ర మంత్రివర్గంలోకి కూడా పంపాలనే ఆలోచన సంకేతాలు చాలా కాలంగా వున్నాయి. యుపిలో అఖిలేష్‌ యాదవ్‌ విజయం తండ్రీకొడుకులకు ఈ ఆలోచనకు ప్రేరణ అయింది. ముందుగా సంబంధాలు పెంచుకుని జాతీయ స్థాయిలో స్థిరపడితే తగు సమయంలో రాష్ట్ర రాజకీయ ప్రవేశం చేయొచ్చనేది దాని సారాంశం. ఇటీవల కెటిఆర్‌ క్రియాశీలత పెరిగిన తర్వాత పొరుగు రాష్ట్రంపై ఆ ప్రభావం కూడా పడిందంటున్నారు. ఎప్పుడు ఎలా అనేది భవిష్యత్తు చెబుతుంది.

రాజ్యసభ నామినేషన్లకు సంబంధించి తెలుగుదేశం నాయకత్వం నిర్ణయం తీసుకునే విషయంలో ఇదే గాక ఇంకా కొన్ని చిక్కు ముడులు కూడా వున్నాయి. వాటిని మరోసారి చూద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close