తట్టుకోలేవ్: బాలయ్య లెవల్‌లో జగన్‌కు లోకేష్ వార్నింగ్

హైదరాబాద్: “చూడు… ఒక వైపే చూడు… రెండోవైపు చూడలాలనుకోకు… తట్టుకోలేవు… మాడిపోతావ్” – ఇదీ నందమూరి బాలకృష్ణ ‘సింహా’ సినిమాలో చెప్పిన డైలాగ్. బాలయ్య అల్లడు కమ్ మేనల్లుడు లోకేష్ కూడా ఇప్పుడు అదే లెవల్‌లో జగన్‌కు వార్నింగ్ ఇస్తున్నారు. తెలుగుదేశంపార్టీకి 55 లక్షలమంది కార్యకర్తలున్నారని, తమవాళ్ళు కళ్ళు తెరిస్తే తట్టుకోలేవ్ అని హెచ్చరించారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో ఎక్స్ అఫిషియో సభ్యుడు లోకేష్ నిన్న గుంటూరులో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జగన్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. జగన్ గుంటూరులో తలపెట్టిన దీక్షకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా బస్సులు తగలపెడదామని, కలెక్టరాఫీసులు ధ్వంసం చేద్దామని, ఆత్మహత్యలకు ప్రేరేపిద్దామని వైసీపీ నేతలు కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. ఈ సందర్భంగా వాళ్ళకు ఒకటే చెబుతున్నానని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క కార్యాలయ అద్దం పగిలినా, ఒక్క యువకుడి బలవన్మరణం జరిగినా అందుకు జగన్‌నే బాధ్యుడిని చేసి, కేసులో ఆయనను ఏ-1గా చేర్చేదాకా పోరాడతామని చెప్పారు. తమకు వారిలాగా దొంగ ఛానల్, పేపర్ లేవని, 55 లక్షలమంది కార్యకర్తలు ఉన్నారని అన్నారు. వారందరూ కళ్ళు తెరిస్తే తట్టుకోలేరంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close