రకుల్ కిస్ వద్దన్న చరణ్

రామ్ చరణ్ హీరోగా ఈ నెల 16న రిలీజ్ అవ్వబోతుంది బ్రూస్ లీ. ఎన్నో అంచనాలతో వస్తున్న ఈ సినిమాకు ఎలాంటి బ్యాడ్ సెంటిమెంట్ ఫాలో కాకుండా చూస్తున్నారు చిత్ర యూనిట్. ముఖ్యంగా చరణ్ ఈ సినిమాను చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నాడు. అయితే సినిమాలో హీరోయిన్ గా చేసిన రకుల్ అందాలను ఎరగా వేస్తున్నారని ఇప్పటికే ట్రైలర్స్, సాంగ్స్ చూస్తుంటే అర్ధమవుతుంది. అమ్మడు అందాలన్ని రంగరించి రెచ్చిపోయింది బ్రూస్ లీలో.

అప్సరస లాంటి ముద్దుగుమ్మ రకుల్ అందానికైతే ఫిదా అయిన చెర్రి ఆమెతో లిప్ లాక్ మాత్రం వద్దంటున్నాడు. రవితేజ రీసెంట్ డిజాస్టర్ కిక్-2లో రకుల్ ఇచ్చిన ముద్దు వర్క్ అవుట్ కాకపోగా సినిమా రిజల్ట్ కూడా చిత్ర యూనిట్ నికష్టాల్లో పడేసింది. అందుకే రకుల్ తో లిప్ లాక్ సీన్ తీసినా సినిమాలో మాత్రం దాన్ని కట్ చేయమని చెప్పాడట చరణ్. చిన్న సినిమాల్లో క్యూట్ గాళ్ గా అలరించిన రకుల్ ఒకేసారి పెద్ద హీరోల సినిమాల్లో రెచ్చిపోతుండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

బ్రూస్ లీలో అమ్మడు స్కిన్ షో కూడా హైలెట్ అవ్వనుంది ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ చూస్తుంటే విచ్చల విడిగా అందాల ప్రదర్శన చేసింది రకుల్. ఓ పక్క మాత్రం చిన్న హీరోలకే కాని స్టార్ హీరోల సినిమాల్లో అమ్మడు అన్ లక్కీ అన్న వాదనలు వస్తున్నాయి. అయితే చరణ్ తో నటించిన బ్రూస్ లీ సూపర్ హిట్ అయ్యి ఆ రూమర్లకు చెక్ పెట్టాలనుకుంటుంది రకుల్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]