రాంచరణ్‌ను ఆనందంలో ముంచిన షారుక్

హైదరాబాద్: రాంచరణ్ ‘బ్రూస్‌లీ’ చిత్రం విడుదల తేదీ(అక్టోబర్ 16) దగ్గర పడటంతో నిర్మాణ కార్యక్రమాలు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. షూటింగ్ పార్ట్ రామోజీ ఫిల్మ్ సిటీలో సోమవారం అర్ధరాత్రితో పూర్తయింది. టైటిల్ సాంగ్‌ను చరణ్, రకుల్ ప్రీత్ సింగ్‌లపై చిత్రీకరించారు. ఈ పాటకోసం నిరవధికంగా 24 గంటలపాటు తాను, చరణ్ డాన్స్ చేశామని రకుల్ ట్వీట్ చేసింది. 11వ తేదీకి ఫస్ట్ కాపీ సిద్ధమవుతుందని భావిస్తున్నారు.

Ramcharan-SRK

మరోవైపు ‘దిల్‌వాలే’ చిత్రంకోసం రామోజీ ఫిల్మ్‌సిటీలోనే ఉన్న షారుక్, పక్కనే షూటింగ్ జరుపుకుంటున్న బ్రూస్‌లీ సెట్‌లోకి వెళ్ళి అక్కడున్నవారందరినీ ఆశ్చర్యపరిచారు. సోమవారం అర్థరాత్రి ఈ సంఘటన జరిగింది. బ్రూస్‌లీ సెట్‌పై షారుక్ ఫోటోలను రాంచరణ్ సోషల్ మీడియాలో పెట్టారు. ఆఖరి రోజు షూటింగ్‌లో షారుక్ తమ అందరినీ ఆశ్చర్యపరిచారని పేర్కొన్నారు. సెట్‌లో ఉన్న ఆడపిల్లలందరూ ఊగిపోయారని తెలిపారు. అప్పుడు చిత్రీకరణ జరుగుతున్న టైటిల్ సాంగ్‌ను షారుక్ మానిటర్‌లో చూశారని, పాట బాగా వచ్చిందని మెచ్చుకున్నారని చరణ్ పేర్కొన్నారు. షారుక్ పాటను చూసేటపుడు దర్శకుడు శ్రీను వైట్ల, నిర్మాత దానయ్య, రచయిత గోపి మోహన్, చరణ్ భార్య ఉపాసనకూడా పక్కన ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com