నారా రోహిత్ 20వ సినిమాగా వస్తోంది ‘సుందరకాండ’. వెంకటేష్ నిమ్మలపూడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ రోజు ట్రైలర్ వదిలారు. ఇదొక మిడిల్ ఏజ్ బ్యాచిలర్ కథ. ఓ ఐదు క్వాలిటీస్ ఉన్న తన లైఫ్ పార్ట్నర్ కోసం వెదుకుతుంటాడు రోహిత్. ఆలాంటి క్వాలిటీస్ అమ్మాయిలు దొరకడం కష్టమని చెబుతుంటారు స్నేహితులు. అయినా తన పట్టువిడవడు.
తనకి ఓ రెండు లవ్ స్టోరీలు కూడా ఉన్నాయి. కాలేజ్ డేస్‌లో ఓ అమ్మాయిని, ప్రస్తుతంలో మరో అమ్మాయిని ఇష్టపడతాడు. అయితే ఇక్కడ ఓ సమస్య… అదే ఏజ్ గ్యాప్. కాలేజ్‌లో తనకంటే పెద్ద అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇప్పుడు తనకంటే చిన్న అమ్మాయిని ఇష్టపడతాడు. తర్వాత ఏం జరిగిందనేది కథ.
ట్రైలర్‌ని ర్యాప్ స్టైల్లో చేయడం కొత్తగా ఉంది. నారా రోహిత్ ఎప్పటిలాగే కూల్ కామెడీ టైమింగ్‌తో కనిపించారు. నరేష్, సత్య, వీటీవీ గణేష్, అభినవ్ గోమటం నవ్వించడానికి పెద్ద గ్యాంగ్ ఉంది. ట్రైలర్లో కొన్ని నవ్వులు వున్నాయి. ముఖ్యంగా ఏజ్ గ్యాప్ జంటల గురించి చెబుతూ దిల్ రాజు, తేజస్విని పేర్లు కూడా వాడేశారు. చాలా రోజుల తర్వాత శ్రీదేవి విజయ్‌కుమార్ ఈ సినిమాలో కనిపించడం విశేషం. ఆగస్ట్ 27న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.