100 రోజులు.. 20 రాష్ట్రాలు..! మోడీ ఇక ఎన్నికల ప్రచారానికే పరిమితం..!

భారత ప్రధాని నరేంద్రమోడి ఎక్కువుగా “ఫ్లయింగ్ మోడ్‌”లో ఉంటారని ఆయన విదేశీ పర్యటనల గురించి సోషల్ మీడియాలో జోకులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మరో సారి ఆయన ఈ “ఫ్లయింగ్ మోడ్‌”లోకి వెళ్లబోతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే.. వెళ్లిపోయారు. అయితే.. ఈ సారి ఆయన విదేశాల్లో కాదు.. భారత్‌నే చుట్టబెట్టబోతున్నారు. గత నెల 24న ఒడిషా నుంచి ఈ పర్యటనలు ప్రారంభమయ్యాయి. ఎన్నికల్లో రెండో సారి గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న మోడీ… ఎన్నికల ప్రచారాన్ని దేశవ్యాప్తంగా ఉద్ధృతంగా నిర్వహించనున్నారు. దీని కోసం ప్రత్యేకమైన ప్రణాళికలు సిద్దం చేశారు. వంద రోజుల్లో ఇరవై రాష్ట్రాలను .. ఆయా రాష్ట్రాల్లోని కీలక ప్రాంతాలన్నింటినీ కవర్ చేయాలని నిర్ణయించుకున్నారు.

డిసెంబర్ 24, 25 తేదీల్లో ఒడిశా, అసోంలలో పర్యటించి బహిరంగ సభల్లో ప్రసంగించారు. జనవరి 4న మోదీ మరోసారి అసోంలో పర్యటించనున్నారు. ఐదో తేదిన ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో బహిరంగ సభలో పాల్గొననున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసి ఓటమిపాలైన 123 నియోజకవర్గాలపై పార్టీ ఈసారి ప్రత్యేక దృష్టిపెట్టింది. మిషన్ 123 పేరుతో 123 నియోజకవర్గాలను 25 క్లస్టర్లుగా విభజించి.. ఒక్కో క్లస్టర్ బాధ్యతలను ఒక్కో నాయకుడికి అప్పజెప్పింది. వీటన్నిటంిలోనూ మోడీ ప్రచారం చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.

బీజేపీకి, మోడీకి ఉన్న అడ్వాంటేజ్.. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది.. ఏ ఏ విడతల్లో ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్నికలు జరపాలనే అంశం… ఈసీని పరోక్షంగా హ్యాండిల్ చేయడం ద్వారా తమ చేతుల్లోకి తెచ్చుకున్నారు. ఇది కేసీఆర్‌కు కూడా ఉపయోగపడింది. ఆయన.. ఎన్నికల షెడ్యూల్‌తో సహా మొత్తం రెడీ చేసుకుని… అసెంబ్లీని రద్దు చేసేశారు. యాభై రోజుల్లో వంద సభలంటూ.. ప్రచారం ఉద్ధృతంగా నిర్వహించి ప్రతిపక్ష పార్టీలను రేసులోకి రాకుండా.. తాను సగం దూరం వెళ్లిపోయారు. అంతిమంగా ఘన విజయం సాధించారు. ఇప్పుడు మోడీ కూడా అలాంటి ప్లాన్‌లోనే ఉన్నారనుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close