చిరంజీవిని అభిమానులు, చిత్ర పరిశ్రమ ప్రేమగా మెగాస్టార్ అని పిలుచుకొంటుంది. టాలీవుడ్‌కి ఎంతమంది స్టార్లు వచ్చినా సిసలైన మెగాస్టార్ మాత్రం చిరంజీవినే. చిరు తనయుడు రామ్‌చరణ్ రంగ ప్రవేశం చేసినా.. అతన్ని మెగా పవర్ స్టార్ అని మాత్రమే పిలుస్తున్నారు. అయితే… అల్లు అర్జున్ మాత్రం రామ్‌చరణ్‌కి ‘మెగాస్టార్’ బిరుదు కట్టబెట్టేశాడు. చిరంజీవి 61వ పుట్టిన రోజు వేడుకల్లో ఈ ఆసక్తికరమైన అంశం చోటు చేసుకొంది.
శిల్పకళావేదికలో జరిగిన చిరు పుట్టిన రోజు కార్యక్రమానికి మెగాస్టార్ రాలేదు. స్టేజీపై చరణ్ మాట్లాడుతుంటే ‘మెగాస్టార్.. మెగాస్టార్’ అంటూ అభిమానులు నిననిందించారు. ఆ సమయంలోనే స్టేజీ ఎక్కిన బన్నీ.. చరణ్‌ని చూపిస్తూ ‘మెగాస్టార్ ఇక్కడే ఉన్నాడు కదా.. మరి మెగాస్టార్ కావాలి అని ఎందుకు అరుస్తున్నారు’ అంటూ అభిమానుల్ని ఉద్దేశించి అన్నాడు. అంటే… బన్నీ ఉద్దేశంలో మెగాస్టార్ రామ్‌చరణ్ అన్నమాట. అయితే రామ్‌చరణ్ మాత్రం ఆ ప్రసంశని లైట్‌గానే తీసుకొన్నాడు. ‘నాకు అంత సీన్ లేదు లే’ అంటూ నవ్వేశాడు. మొత్తానికి చరణ్‌కి నయా మెగాస్టార్ చేయడానికి, ఆ బిరుదు అతనికి అంకితం చేసేయ్యడానికి మెగా కాంపౌండ్ అప్పుడే ప్రయత్నాలు మొదలెట్టిందన్నమాట.
