నయీం డంప్… శేషన్న జంప్?

గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ తర్వాత పత్తా లేకుండా పోయిన శేషన్న ఎక్కడున్నాదనే మిస్టరీ వీడలేదు. నయీం ఏ సెటిల్ మెట్ చేసినా, కుడిభుజం శేషన్నప్రమేయం కచ్చితంగా ఉండేదట. అలాంటి వాడు ఆ గ్యాంగ్ ను మళ్లీ ఏకతాటిపైకి తెచ్చి దందాలు చేయడానికి స్కెచ్ వేస్తున్నాడా? నయీంకు, తనకు మాత్రమే తెలిసిన చోట ఉన్న డంప్ నుంచి భారీగా డబ్బును తీసుకుని ఉడాయించాడా? దేశంలో ఏదో ఒక చోట సెటిల్ కావడానికి ప్రయత్నిస్తున్నాడా? అన్నీ అనుమానాలే. దేనికీ ప్రస్తుతం జవాబు లేదు.

శేషన్న కోసం వేటలో ఓ ముందడుగు వేశామంటున్నారు పోలీసులు. శేషన్న కారు డ్రైవర్ ను, మరొకరిని అరెస్టు చేశారు. హైదరాబాద్ కుషాయి గూడ ప్రాంతంలో వీళ్లను పట్టుకున్నారు. డ్రయివర్ ద్వారా శేషన్న ఆచూకీ దొరకవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఇంటరాగేషన్ ద్వారా శేషన్న అడ్డాల గురించి పోలీసులు తెలుసుకోగలరు. అయితే, ఇంత జరిగిన తర్వాత అతడు పాత అడ్డాల్లోనే ఉంటాడా? కరుడుగట్టిన నేరస్తుడు, మాజీ నక్సలైట్ అయిన శేషన్న అంత అమాయకుడేం కాదు. కాబట్టి, ఎవరికీ తెలియని చోట ఉండి ఉంటాడు. బహుశా భారీగా సొమ్ముతో ఎక్కడో దాక్కుని ఉండొచ్చు.

నల్లమల అడవుల్లో నయీంకు చెందిన డంప్ లో కోట్లాది రూపాయలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. బహుశా దీని గురించి ఆ గ్యాంగులో ఒక్క శేషన్నకు మాత్రమే తెలిసి ఉండొచ్చంటున్నారు. అదే నిజమైతే, నయీం ఎన్ కౌంటర్ తర్వాత ఆ నిధిని తీసుకుని ఎక్కడికో ఉడాయించినా ఆశ్చర్యం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా జరిగే అవకాశాలే ఎక్కువని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. డ్రయివర్ ద్వారా కూడా శేషన్న ఆచూకీ దొరక్కపోతే, ఇక ఇప్పట్లో అతడిని పట్టుకోవడం సాధ్యం కాదేమో అనేది తెలంగాణ పోలీసు వారి అంచనా. చివరికి ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close