భారత్ పై నేపాల్ ప్రధాని అప్పుడే రుసరుసలు?

కొన్ని రోజుల క్రితం నేపాల్ ప్రధానిగా ఎన్నికయిన ఖడ్గ ప్రసాద్ ఓలి అప్పుడే భారత్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత్, చైనా దేశాల మధ్య 1954లో యుద్ధం ముగిసిన తరువాత ఇరుగు పొరుగు దేశాల మధ్య సత్సంబంధాలను నెలకొల్పేందుకు పంచ్‌శీల్‌ సూత్రాల ఒడంబడిక జరిగిందని, కానీ భారత్ దానిని పెద్దగా పట్టించుకోకుండా నేపాల్ పై అనధికార దిగ్బంధాన్ని అమలు చేస్తోందని అన్నారు. ఆనాడు యుద్ద సమయంలో తమ దేశం ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల కంటే భారత్ అమలు చేస్తున్న ఈ అనధికార దిగ్బందం కారణంగానే ఎక్కువ ఇబ్బంది పడుతోందని అన్నారు. కనుక తమ దేశ సమగ్రత, దేశ సార్వభౌమత్వాన్ని, స్వాతంత్ర్యాన్ని గౌరవిస్తూ భారత్ తక్షణమే అనధికార దిగ్బంధాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన భారత్ కి విజ్ఞప్తి చేసారు. భారత్ నుండి నేపాల్ కి నిత్యం బియ్యం, గోదుమలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్, అనేక రకాల మందులు ఎగుమతి అవుతుంటాయి. అనేక దశాబ్దాలుగా భారత్ నేపాల్ కి అండగా ఉంటూ ఆ దేశంలో అనేక ప్రాజెక్టుల ఏర్పాటుకు సహకరిస్తోంది. కానీ నేపాల్ మాత్రం భారత్ పట్ల ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంది. భారత్ అందిస్తున్న సహాయసహకారాల కంటే, ఆ వంకతో అది తమ దేశ రాజకీయాలలో, ప్రభుత్వంపై ప్రత్యక్ష, పరోక్షంగా వేలుపెడుతోందని ఆరోపిస్తోంది. ఇటీవల భారత్-నేపాల్ సరిహద్దుల వద్ద నేపాల్ పోలీసులు జరిపిన కాల్పులలో ఇద్దరు భారతీయులు మరణించడంతో భారత్ కూడా నేపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. బహుశః ఆ కారణంగానే తమకు నిత్యావసర సరుకులు, ముఖ్యంగా పెట్రోల్ రవాణాను తగ్గించిందని నేపాల్ ఆరోపిస్తోంది. కనుక ఈ అప్రకటిత దిగ్బంధాన్ని ఎత్తివేయాలని నేపాల్ ప్రధాని కోరుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close