హైదరాబాద్ శివారులో విల్లాలకు విలాసంగా ఏరుతున్న ప్రాంతం వెలిమల. ఈ ప్రాంతం, రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొత్త హాట్‌స్పాట్‌గా మారుతోంది. ఔటర్ రింగ్ రోడ్ ( కు సమీపంలో ఉండటం, గ్రీన్ కవరేజ్ వంటి వాటితో పాటు ఇన్ ఫ్రా అభివృద్ధి వల్ల విల్లాలు, అపార్ట్మెంట్ల డిమాండ్ పెరిగింది. 2025లో ఈ ప్రాంతంలో ఆస్తి ధరలు 10-15 శాతం పెరిగినట్టు నిపుణులు అంచనా.
వెలిమలలో విల్లాలు ప్రధానంగా 3BHK, 4BHK ఆప్షన్లుగా ఉన్నాయి. ధరలు రూ. కోటిన్నర నుంచి అత్యంత లగ్జరీ విల్లాలు పదిహేనుకోట్ల వరకూ అమ్ముతున్నారు. అపార్ట్మెంట్లు మరింత అఫోర్డబుల్‌గా రూ. 63 లక్షల నుంచి 2 కోట్ల వరకు ఉన్నాయి, స్క్వేర్ ఫుట్కు రూ. 4,500-5,500 మధ్య బిల్డర్లుచెబుతున్నారు. అపార్టుమెంట్లు వద్దు విల్లాలే కొనాలనుకున్న వారికి వెలిమమ మంచి చాయిస్‌గా మారింది.
పాటి, వట్టినాగులపల్లి, కొల్లూర్, తెల్లాపూర్ వంటి ప్రాంతాలకు వెలిమ సమీపంలో ఉండటం వల్ల, IT హబ్‌లకు 20-30 నిమిషాలవ్యవధిలో చేరుకోవచ్చు. సోషల్ ఇన్ఫ్రా కూడా బలం. స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటల్స్ సమీపంలో ఉన్నాయి. రోడ్ విస్తరణలు, వాటర్ పైప్లైన్లు మెరుగుపడుతున్నాయి. రేట్లు ఆశాజనకంగా పెరుగుతున్నాయని.. ఐటీ కారిడార్ కుసమీపంగా ఉన్నా ధరలు తక్కువ కావడంతో డిమాండ్ ఎక్కువగా ఉంటోందని రియల్టర్లు చెబుతున్నారు.