ప్ర‌భాస్ ఓ కోసం స‌రికొత్త టైటిల్‌

ప్ర‌భాస్ – రాధాకృష్ణ కుమార్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. కృష్ణం రాజు సొంత సంస్థ గోపీ కృష్ణ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పూజా హెగ్డే క‌థానాయిక‌. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి కాస్త గ్యాప్ వ‌చ్చింది. ప్ర‌భాస్ విదేశాల్లో ఉన్నాడు. తిరిగొచ్చాక షూటింగ్ మొద‌ల‌వుతుంది. ఈనెల 23న ప్ర‌భాస్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్ వ‌స్తుందేమో అని ఆశ‌గా ఎదురుచూస్తున్నారు అభిమానులు.

అయితే ఈ సినిమాకి ఇప్ప‌టి వ‌ర‌కూ టైటిల్ ఏమిట‌న్న‌ది కూడా ప్ర‌క‌టించలేదు. ‘జాన్‌’ అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉంది. అయితే.. ఆ టైటిల్ ప్ర‌భాస్ కి న‌చ్చ‌లేద‌ని తెలుస్తోంది. ఈ టైటిల్ మార్చ‌మ‌ని ద‌ర్శ‌కుడ్ని కోరాడ‌ట ప్ర‌భాస్‌. అందుకే చిత్ర‌బృందం మ‌రో రొమాంటిక్ టైటిల్ కోసం అన్వేషిస్తోంది. నిజానికి ప్ర‌భాస్ పుట్టిన రోజున ‘జాన్‌’ అనే టైటిల్‌నే అధికారికంగా ప్ర‌క‌టిద్దామ‌నుకున్నారు. లోగోల్ని కూడా రెడీగా చేసి పెట్టుకున్నారు. అయితే ప్ర‌భాస్ తాజా నిర్ణ‌యంతో టైటిల్ ప్ర‌క‌ట‌న వాయిదా ప‌డింది. 23 లోపు కొత్త టైటిల్ వ‌చ్చి, అది ప్ర‌భాస్‌కి న‌చ్చితే ఓకే, లేదంటే… టైటిల్ కోసం ఇంకొన్ని రోజులు ఆగాలి. 23న ఫ‌స్ట్ లుక్ అయినా బ‌య‌ట‌కు వ‌స్తుందా, లేదంటే… ప్ర‌భాస్ ఫ్యాన్స్‌ని వెయిటింగ్‌లో ప‌డేస్తారా.. అనేదీ డౌటుగానే ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com