వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకున్న విషయాల్లో మొదట మద్యం ఉంటే తర్వాత ఇసుక ఉంటుంది. అంతకు ముందు ప్రభుత్వం ఉచితంగా ఇసుక ఇచ్చేది. జగన్ రాగానే మొత్తం ఆపేశారు. ఇసుకను ఎవరికీ దొరకకుండా కట్టడి చేసి.. దోపిడీకి ప్లాన్ చేసుకున్నారు. ఇసుకపాలసీని రెండు మూడు సార్లు మార్చారు. మొత్తంగా దోపిడీ సొమ్ము అంతా ఒకరికే చేరేలా ప్లాన్ చేసుకున్నారు. ఐదు సంవత్సరాలు అమలు చేశారు. ఇక్కడా అసలు విషయం ఏమిటంటే.. మొత్తం నగదు లావాదేవీలే నిర్వహించారు. కానీ వదలాల్సినన్ని సాక్ష్యాలు వదిలారు.
ఐదేళ్ల పాటు ఇసుక నుంచి దోపిడీ ఓ రేంజ్
అధికారంలోకి వచ్చింది మొదలు.. ఉచిత ఇసుక విధానాన్ని తొలగించి పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారు. సాధారణంగా ఇలాంటి వ్యవహారాల్లో వైసీపీ నేతలు ఎక్కువగా లబ్దిపొందాలి. పార్టీ కోసం పని చేసే క్యాడర్ కు ఈ ఉపాధి అయినా ఉండాలని అనుకోవాలి. జగన్ రెడ్డి మాత్రం అలా అనుకోలేదు. ఇసుక కూడా తనదేనని ఆయన దోపిడీకి పాల్పడ్డారు. ఆయన శ్రేయోభిలాషి ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా… ఇసుక నుంచి పోయే ప్రతి రూపాయి జగన్ కే చేరుతుదంని అంతా వ్యవస్థీకృతం అయిందని చాలా సార్లు మీడియా సమావేశంలో చెప్పారు కూడా. ఆయనకే అంత క్లారిటీ ఉంటే ఇక పార్టీ నేతలకు ఉండదా ?
బినామీ కంపెనీల పేరుతో మొత్తం తాడేపల్లి ఆపరేషన్
ఏపీలోని ఇసుక మొత్తం ఓ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చినట్లుగా చూపించారు. కానీ దోపిడీ అంతా.. తాడేపల్లి నుంచి జరుగుతుంది. ఎక్కడినుంచి ఎవరు ఇసుక తీసుకెళ్లినా లెక్క తెలియాల్సిందే. ఇప్పుడుఆ లెక్కలు తీస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో రూ. 1,467 కోట్ల విలువైన ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయని, దాదాపు 1.22 కోటి టన్నుల ఇసుక అక్రమంగా తవ్వినట్లు తేలింది. ఇష్టం వచ్చినట్లుగా పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి నదుల్ని సైతం కొల్లగొట్టడంతో విషయం సుప్రీంకోర్టుకు కూడా చేరింది. కలెక్టర్లును ముందుపెట్టి చేసిన దోపిడీ సాక్ష్యాలతో వెలుగులోకి వచ్చింది.
చర్యలకు సమయం వచ్చేసింది !
ఇసుక స్కామ్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది. వైసీపీ హయాంలో కలెక్టర్లే.. తమ దగ్గర అసలు తవ్వకాలు జరగడం లేదని ఎవరో రాసిచ్చినట్లుగా ఒకే ఫార్మాట్ లో జిల్లాల పేర్లు మార్చి… సుప్రీంకోర్టుకు సమర్పించారు. ఎంత ఘోరమైన మాఫియానో దీన్ని బట్టి అర్థమైపోతుంది. కలెక్టర్లను కూడా మాఫియాలో భాగంగా మార్చేశారు. అడ్డగోలు ఇసుక తవ్వకాల వల్ల ఓ డ్యామ్ కొట్టుకుపోయింది. అన్నమయ్య డ్యామ్ కొటట్టుకుపోవడానికి కారణం.. ఇసుక తవ్వకాలు. అడ్డగోలు ఇసుక తవ్వకాల వల్ల నదుల్లో ఏర్పడిన గొయ్యిల కారణంగా వందల మంది చనిపోయారు. ఇప్పుడీ లెక్కలన్నీ వెలికి తీసి.. అసలు నిందితుల్ని చట్టం ముందు నిలబెట్టాల్సి ఉంది.