నిజామాబాద్ జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు డి. శ్రీనివాస్ పై అసంతృప్తి

టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ పై పాత నిజామాబాద్ జిల్లా ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసి ఉమ్మడిగా పార్టీ అధినేత కేసీఆర్ కు లేఖ ద్వారా ఫీర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని DSను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని లేఖలో పేర్కొన్న టిఆర్ఎస్ నేతలు. అయితే డీఎస్ త‌న సోంత గూటికి వెళ్లెందుకు సిద్ధ‌మౌతున్న‌ర‌నే ప్ర‌చారం పెద్ద ఎత్తున న‌డుస్తోంది. కాంగ్ర‌స్ పార్టీలో చేరెందుకు అయ‌న ఇప్పటికే రంగం సిద్దం చెసుకున్న‌ట్లు డీ శ్రీనివాస్ స‌న్నిహితులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం కాంగ్రస్ సీనియ‌ర్ నేత గులాం న‌బీ ఆజాద్ తో డిఎస్ మంత‌నాలు జ‌రిపారని తెలుస్తోంది. ర‌హాస్యంగా గ‌త కొంత కాలంగా ఆయన కాంగ్రెస్ పెద్ద‌ల‌తో భేటీలు నిర్వ‌హిస్తున్న‌ర‌ని టీఆర్ఎస్ నిజామాబాదు జిల్లా నేత‌లు అంటున్నారు.

ఇటివ‌ల నిర్వ‌హించిన టీఆర్ఎస్ ఫ్లిన‌రి స‌మావేశంలో సాధ‌ర‌ణ నేత‌ల్ల డిఎస్ కింద కుర్చున్నారు. క‌నీసం వేదిక మీద‌కు అయ‌న‌ను పిలిచిన వాళ్లు కూడా లేకపోవడంతో తీవ్ర మ‌న‌స్తపానికి గురైయారు. గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్రంలో పీసీసీ ఛీప్ గా పని చేసిన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాల్సిన వ్య‌క్తిని ఇలా కింద కూర్చోబెట్టడంపై అయ‌న అనుచ‌రులు ఆవేదన వ్య‌క్తం చేశారు. అప్ప‌టి నుండి డిఎస్ తీరిగి కాంగ్ర‌స్ లో చేరుతున్నారని ప్ర‌చారం మొద‌లైంది. అయితే కొద్ది రోజుల క్రితం మున్నూరు కాపు సామాజిక‌వ‌ర్గనికి చెందిన ఓ సమావేశంలో పాల్గొన్న డీ. శ్రీనివాస్ పై కుల పెద్దలు మండిప‌డ్డ‌రంటా..ముఖ్యమంత్రి స్థాయి కలిగిన నేత అయివుండి, టీఆర్ఎస్‌లో ఎందుకు చేరావని కుల సంఘం నేతలు డీఎస్ ను నీల‌దిశారంటా.డీఎస్ ను మేం ఆహ్వానించలేదు, గతి లేక మా పార్టీలో చేరారు అని కవిత వ్యాఖ్యానించిందని, ఇంత మాట అన్న త‌ర్వాత కూడా అక్క‌డ ఉండాల్సిన అవ‌స‌రం లెద‌ని తెల్చి చేప్పారంటా.

ఈ పరిణామాలతో పార్టీ మారే ప్రయత్నాలు ప్రారంభించిన డీఎస్ అప్ప‌టి నుండి కాంగ్ర‌స్ నేత‌లతో స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారంటా. అయితే టీఆర్ఎస్ నుండి గౌర‌వంగానే బ‌య‌ట‌కు వెళ్లాల‌ని డిఎస్ అలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్య‌మంత్రి కేసిఆర్ తో స‌మావేశం అయి.. త‌న‌కు రాజ‌స‌భ్య ప‌ద‌వి ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు చెప్పి పార్టీ రాజీనామ లేఖ అందించాల‌ని డిఎస్ అనుకుంటున్నారు. ఈ మేరుకు డిఎస్ ముఖ్య‌మంత్రి అపాయింట్ మెంట్ కూడా కోరారు. కానీ టీఆర్ఎస్ నేత‌లు మాత్రం అయ‌న‌ను స‌స్సెండ్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. మ‌రి కేసిఆర్ డిఎస్ ను స‌స్పెండ్ చేస్తారా లేదా క‌ల‌సి మాట్ల‌డ‌తారా అనీ చూడాలి.

[pdf-embedder url=”https://www.telugu360.com/te/wp-content/uploads/sites/2/2018/06/DS.pdf”]

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రైవేట్ సైన్యం…జగన్ కు ఎందుకంత భయం..!!

వైసీపీ అధినేత జగన్ రెడ్డి భారీగా ప్రైవేట్ సెక్యూరిటీని నియమించుకున్నారు. తాడేపల్లిలోని జగన్ నివాసం చుట్టూ 30మందితో కొత్తగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఇంత పెద్దమొత్తంలో ఆయన ప్రైవేట్ సైన్యాన్ని నియమించుకోవడం హాట్...

రీఎంట్రీకి శిశికళ రెడీ !

తమిళనాట స్టాలిన్‌కు పోటీ ఎవరు అన్నదానిపై క్లారిటీ లేకపోవడంతో రాజకీయ శూన్యత ఏర్పడింది. అన్నామలైకు తమిళనాడులో తప్ప బయట కావాల్సినంత హైప్ వస్తోంంది. తమిళనాడులో పట్టించుకునేవారు లేరు. పన్నీరు సెల్వం,...
video

కల్కి.. సమయం చూడని సమరం

https://www.youtube.com/watch?v=5UfGZFrXKig మూడు సార్లు వాయిదా పడ్డ ‘కల్కి 2898 ఎ.డి’ భైరవ పాట ఎట్టకేలకు విడుదలైయింది. సంతోష్ నారాయణ స్వరకల్పనలో రామజోగయ్య శాస్త్రి, కుమార్‌ రచించిన ఈ పాట... దిల్జీత్‌ దోసాంజ్, దీపక్‌ బ్లూ...

వైసీపీ నేతలకు గేట్లు క్లోజ్!

ఏపీలో వైసీపీ ఘోర పరాజయంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు నేతలు రెడీ అవుతున్నారా..? ఇప్పటికే పార్టీ మార్పుపై కొంతమంది టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్ళారా..? ఐదేళ్ళు టీడీపీ నేతలను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close