ప‌వ‌న్ ప‌క్క‌న హీరోయిన్ ఫిక్స్ కాలేద‌ట‌

ఇదిగో పులి – అంటే అదిగో తోక అన్న‌ట్టు త‌యార‌వుతాయి సినిమా వార్త‌లు. ప‌వ‌న్ క‌ల్యాణ్ – హ‌రీష్ శంక‌ర్ కాంబోలో సినిమా అనే న్యూస్ రాగానే, క‌థానాయిక ఎవ‌ర‌న్న విష‌యంలో ర‌క‌ర‌కాల వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. కొంత‌మంది కైరా అద్వానీ అని రాశారు. ఇంకొంత‌మంది మాల‌మాళ క‌థానాయిక మాన‌స రాధాకృష్ణ‌న్ పేరు తెర‌పైకి తీసుకొచ్చారు. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఈ పేరు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు. కానీ ప‌వ‌న్ ప‌క్క‌న క‌థానాయిక అనేస‌రికి.. ఆమె ఫొటోలు తెగ వైర‌ల్ అయ్యాయి. ఈ వార్త‌ల‌పై హ‌రీష్ శంక‌ర్ స్పందించారు. తమ సినిమాలో క‌థానాయిక ఇంకా ఫిక్స్ కాలేద‌ని ప్ర‌క‌టించి గాసిప్పుల‌కు చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేశారు. హ‌రీష్ ప్ర‌స్తుతం స్క్రిప్టుని త‌యారు చేసే ప‌నిలో ఉన్నారు. అది అయ్యాకే హీరోయిన్ కోసం అన్వేష‌ణ మొద‌ల‌వుతుంది. పైగా ఈ సినిమా ప‌ట్టాలెక్క‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. ముందు వ‌కీల్ సాబ్ పూర్త‌వ్వాలి, ఆ త‌ర‌వాత క్రిష్ సినిమా ముగించాలి. అప్పుడు హ‌రీష్ సినిమా మొద‌ల‌వుతుంది. ఇక హీరోయిన్ కోసం అప్పుడే తొంద‌ర ప‌డి లాభ‌మేముంది??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close