కేంద్రానికి కూడా నో అప్పుల డీటైల్స్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తోందని కాగ్ రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. అవన్నీ కాగ్ పరధిలోకి వచ్చే అప్పులు. కానీ ప్రభుత్వం ముసుగులో గుద్దులాటలుగా.. పెద్ద ఎత్తున ఇతర పద్దతుల్లో అప్పులు చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్రానికి ఆ ఏడాది చేసిన అప్పుల వివరాలు మొత్తం ఇస్తేనే.. తదుపరి అప్పులు చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది. కానీ ఏపీ సర్కార్ ఇంత వరకూ అప్పుల వివరాలు ప్రకటించలేదు. కేంద్రానికి పంపలేదు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం కొత్త అప్పులు చేయడానికి ఏపీ సర్కార్‌కు అవకాశం చిక్కడం లేదు.

నిజానికి కేంద్రం ఈ సారి ఏపీ సర్కార్‌కు భారీగా రుణం తీసుకునే అవకాశాన్ని కల్పించింది. ఆర్బీఐ నుంచి బాండ్ల ద్వారా ఏకంగా రూ. 42వేల కోల్ల రుమం తీసుకునే అవకాశాన్ని కల్పించింది. కానీ ఈ రుణం తీసుకోవాలంటే కొన్ని నిబంధనలు పూర్తి చేయాలి. గత ఆర్థిక సంవత్సరంలో చేసిన అప్పుల వివరాలు, గ్యారంటీల ద్వారా తెచ్చిన అప్పుల వివరాలు, అందులో రెవెన్యూ వ్యయం ఎంత.. పెట్టుబడి వ్యయం ఎంత..చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇది రహస్యం అనుకున్నారేమో కానీ… ఏపీ పూర్తిస్థాయిలో కాకుండా తాత్కాలికంగా కొంత సమాచారాన్ని కేంద్రానికి పంపింది. ఈ వివరాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. అందుకే పర్మిషన్ ఇవ్వలేదు.  

జీతాలు, పెన్షన్లకుకూడా.. అప్పుల మీదే ఆధారపడే పరిస్థితి వచ్చిందంటే.. ఇది దివాలా దశేనని.. ఆర్థిక నిపుణులతో పాటు విపక్ష నేతలు మండిపడుతున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్ని వేల కోట్లు అప్పులు చేస్తున్నా… పెండింగ్ బిల్లులు అలాగే ఉండిపోతున్నయని.. తీసుకొస్తున్న అప్పులు.. వస్తున్న ఆదాయం అంతా ఏం చేస్తున్నారో చప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఉలుకు.. పలుకు ఉండటం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రభాకర్ రావు వచ్చాకే అసలు ట్యాపింగ్ సినిమా !

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో నిందితులైన హైదరాబాద్‌ మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన గట్టు మల్లును ఇన్స్‌పెక్టర్ ను పెట్టుకుని ఓ మాఫియా నడిపారని...

డేరింగ్ అండ్ డాషింగ్ కేజ్రీవాల్

అవినీతి వ్యతిరేక ఉద్యమం చేసి వచ్చి అవినీతి కేసులో అరెస్టు అయ్యాడన్న ప్రచారం చేస్తున్నారు. సామాన్యుడు కాదు లంచగొండి అని గట్టిగా ప్రజల మైండ్లలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తన సీఎం...

విజయవాడ వెస్ట్ రివ్యూ : సుజనా చౌదరి నమ్మకమేంటి ?

ఏపీలో పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లిన నియోజకవర్గం విజయవాడ వెస్ట్. అక్కడ్నుంచి అభ్యర్థిగా సుజనా చౌదరిని ఖరారు చేయడంతో కూటమిలోని పార్టీలు కూడా ఒప్పుకోక తప్పలేదు. నిజానికి అక్కడ జనసేన...

టీడీపీ @ 42 : సర్వైవల్ సవాల్ !

సాఫీగా సాగిపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు. సవాళ్లను ఎదుర్కొని అధిగమిస్తూ ముందుకు సాగితేనే లైఫ్ జర్నీ అద్బుతంగా ఉంటుంది. అలాంటి జర్నీ ఒక్క మనిషికే కాదు.. అన్నింటికీ వర్తిస్తుంది. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close