ప్చ్.. ఐపీఎల్‌ గ్రౌండ్లలో హైదరాబాద్‌కు చోటు దక్కలేదు..!

ఐపీఎల్ 14వ సీజన్ ఇండియాలోనే జరుగుతోంది. టైం ప్రకారమే ప్రారంభం అవుతోంది. ఏప్రిల్ తొమ్మిది నుంచి టోర్నీ జరుగుతుంది. కానీ ఈ సారి అసలు షాక్ మాత్రం హైదరాబాదీలకు తగిలింది. సన్ రైజర్స్ హైదరాబాద్ హోంగ్రౌండ్‌గా హైదరాబాద్ లేదు. ఆ జట్టు యాజమాన్యం అయిన సొంత రాష్ట్రం చెన్నైనే ఉంది. మొత్తం ఆరు వేదికల్లో మాత్రమే ఐపీఎల్ నిర్వహించాలని… నిర్ణయించారు. కరోనానే కారణం. ఆ ఆరు వేదికల్లో హైదరాబాద్ లేదు. అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, దిల్లీ, ముంబయి, కోల్‌కతా నగరాలను ఇందుకు ఎంపిక చేశారు. హైదరాబాద్‌ను ఓ వేదికగా ఉంచాలని.. కరోనా పూర్తిగా కంట్రోల్‌లో ఉందని ప్రభుత్వం వైపు నుంచి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తామని కేటీఆర్ బీసీసీఐకి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడామద్దతు తెలిపింది. అయితే.. బీసీసీఐ .. కేటీఆర్ విజ్ఞప్తిని పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. ఐపీఎల్ నిర్వహణ విషయంలో కరోనా కేసులు పెరిగిపోతున్న కారణంగా మహారాష్ట్ర సర్కార్ వెనుకంజ వేస్తుందేమోనని.. ఆ చాన్స్ హైదరాబాద్‌కు వస్తుందేమోనని అనుకున్నారు. కానీ మహారాష్ట్ర సర్కార్ ఐపీఎల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీందో హైదరాబాద్‌కు నిరాశే మిగిలింది. సన్ రైజర్స్ టీంలో హైదరాబాదీలు ఎవరూ లేరని.. పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో మ్యాచ్‌లు కూడా.. హైదరాబాద్‌లో జరగబోవడం లేదు.

సన్ రైజర్స్ యాజమాన్యం తమిళనాడుకు చెందిన వారు. ఈ సీజన్ లో వారి హోంగ్రౌండ్‌గా చెన్నైనే ఉంటోంది. దీంతో.. పేరుకు మాత్రమే హైదరాబాద్ తప్ప.. మరే విధంగా ఐపీఎల్‌తో ఈ సారి అనుబంధం లేకుండా పోయింది. ఎంపిక చేసిన ఆరు వేదికల్లో అహ్మదాబాద్‌కు అగ్ర తాంబూలం దక్కింది. ఫ్లేఆఫ్స్‌ తో పాటు ఫైనల్ కూడా.. మొతేరా స్టేడియంలోనే జరుగుతుంది. హైదరాబాద్‌తో పాటు రాజస్థాన్, పంజాబ్ జట్లు తమ హోం గ్రౌండ్లలో ఆడలేకపోతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

HOT NEWS

css.php
[X] Close
[X] Close