కేసీఆర్ చేసింది చెప్పుకోకుండా ఈ బెదిరింపులేమిటో..?

యాభై రోజుల్లో వంద సభలంటున్న కేసీఆర్… గత రెండు రోజులుగా… రెండు సభల్లో ప్రసంగించారు. రెండు సభల్లోనూ.. అటు నిజామాబాద్‌లో కానీ.. ఇటు నల్లగొండలో కానీ… పోరాడి.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో… తొలి ప్రభుత్వం.. ఆయా జిల్లాలకు ఏమి చేశారో.. ఇతమిత్థంగా ఒక్కటంటే.. ఒక్కటీ చెప్పుకోలేకపోయారు. నిజామాబాద్ పోయినా… గొర్రెలిచ్చిన.. బర్రెలిచ్చిన.. చెక్కులిచ్చిన అని చెప్పుకునుడే కానీ.. జిల్లా అభివృద్ధికి ఫలానా పని చేసిండని చెప్పుకోలేదు. నల్లగొండ పోయినా అదే గోస. నల్లగొండ అందరికీ ఫ్లోరైడ్ గుర్తుకొస్తుంది. కేసీఆర్‌కు గుర్తుకు వస్తుంది. నాలుగున్నరేళ్ల కిందట..ఎన్నికల ప్రచార సభలకు వచ్చి ఇన్నేళ్లయినా ఫ్లోరైడ్ సమస్య పోలేదు.. దానికి కారణం.. సమైక్య పాలకులు.. కాంగ్రెస్ నేతలేనని తీర్మానించారు. బంగారు తెలంగాణలో ఫ్లోరైడ్ సమస్యే ఉండదనన్నారు. నిన్న నల్లగొండ జిల్లాకు పోయి.. ఆ ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి ఏం చేసిండో చెప్పుకోలేకపోయారు.

మిషన్ భగీరధ నీళ్లు ఇచ్చిన తర్వాత ఓట్లు అడగడానికి వస్తానని గతంలో పదే పదే చెప్పారు. కానీ.. ఇప్పుడు ఎక్కడా నీళ్లు రావట్లేదు. ఎక్కడిక్కడ పైపులు మాత్రం కుప్పలు తెప్పలుగా తెచ్చి పడేశారు. పైపులేస్తే నీళ్లొస్తాయా..? అన్నట్లుగా ఉంది వ్యవహారశైలి. పైపుల కంపెనీల కోసం… ఈ పథకం ఉన్నట్లుందన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయినప్పటికీ.. రెండు నెలల్లో నీళ్లొస్తున్నాయని చెప్పుకున్నారు. ఇక నల్లగొండ జిల్లాకు ఏమీ చేయలేదనే విషయాన్ని పరోక్షంగా అంగీకరించారు. ఓ విద్యుత్ ప్రాజెక్ట్ పెడుతున్నామని చెప్పుకొచ్చారు. కానీ దానికే .. ఎన్నో అవుట్ డేటెడ్ వ్యవహారాలు. ఇప్పటికీ పనులు జరగడం లేదు. దాన్ని కూడా కాంగ్రెస్ మీద నెట్టేశారు. మొత్తంగా చూస్తే… అటు నిజామాబాద్‌లోనూ.. ఇటు నల్లగొండలోనూ.. కేసీఆర్.. తమ ప్రభుత్వం గట్టిగా ఏం చేసిందో చెప్పుకోలేకపోయారు. రెండు నెలల్లో నీళ్లు వస్తాయంటున్నారు. ఈ నీళ్లు ఇచ్చినంకనే… ఓట్ల కోసం రావొచ్చు కదా అని సగటు ఓటర్ ప్రశ్న.

కేసీఆర్..ఆదాయ వృద్ధిని అభివృద్ధి రేటుగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ అవేమీ సామాన్యులకు అర్థమయ్యేవి కాదు. తమ బతుకులు ఏమైనా బాగుపడ్డాయా లేదా అన్నదే చూసుకుంటారు. టీఆర్ఎస్ పాలనలో.. ఏ ఒక్క పథకం.. సామాన్యుల దగ్గరకు వెళ్లలేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అధికారం ఉందని..ఇబ్బడి మబ్బడిగా… టీఆర్ఎస్‌లో చేరిపోయిన నేతలు.. ఆ పధకాలను మెక్కేశారు. ఇవన్నీ కేసీఆర్‌కు తెలుసు.. అందుకే… మళ్లీ టీఆర్ఎస్ రాకపోతే… గోస పడుతరు అంటూ.. హెచ్చరికలతో కూడా బెదిరింపులు చేస్తున్నారు. అటు చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఏమీ చేయలేదు… ఇటు ముందస్తుకు ఎందుకు వెళ్తున్నామో చెప్పడానికి సమాధానం లేదు. అంతిమంగా… చంద్రబాబును చూపించి.. ఓట్లతో గట్టెక్కుదామని మాత్రం ప్లాన్లు వేసుకున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close