హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎన్నారైలకు ప్రధాన ఇన్వెస్ట్మెంట్ హబ్‌గా మారుతోంది. IT బూమ్, ఇన్ఫ్రా అభివృద్ధి , స్థిరమైన రిటర్న్స్‌తో, 2025లో NRIs షేర్ 18-20%కి చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మార్కెట్ భారతదేశంలోని ఇతర మెట్రోలతో పోలిస్తే ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కాకుండా.. దేశంలోని ఇతర ప్రాంతాల వారు కూడా హైదరాబాద్ లో ఓ ఆస్తి ఉంటే.. మంచి పెరుగుదల ఉంటుందని అనుకుంటున్నారు.
హైదరాబాద్ లో విదేశాల్లోసంపాదించుకునేవారి పెట్టుబడులు చాలా కాలంగా పెరుగుతున్నాయి. 2019లో 10% మార్కెట్ షేర్ నుంచి 2023లో 15%కి చేరాయి. 2025లో 20%కి చేరవచ్చని అంచనా. మొదటి ఆరు నెలల్లో ఇంటర్నేషనల్ ఇన్‌ఫ్లోలు 37% పెరిగాయని చెబుతున్నారు. గచ్చిబౌలి/ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతమే ఎన్నారైలకు హాట్ ఫేవరెట్ గా ఉంది. ప్రస్తుతం హై రైజ్ ప్రాజెక్టులకు వస్తున్న ఎంక్వయిరీల్లో సగం వరకూ ఎన్నారైల నుంచే లోని చెబుతున్నారు.
కోకాపేట్/నర్సింగి , తెల్లాపూర్/కొల్లూర్ తో పాటు శంషాబాద్ వైపు పెట్టుబడుల రూపంలో ఇళ్లు, ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కువ రిటర్న్స్ తో పాటు రెంటల్ ఇన్‌కం కూడా అధికంగా ఉండటం అందర్నీ ఆకర్షిస్తోంది. అమెరికాలో పరిస్థితులు ఎలా ఉన్నా.. ఈ ఫ్లోపై పెద్దగా ప్రభావం పడదని చెబుతున్నారు.