NTR ఆచితూచి అడుగులేస్తునాడా?

ప్రస్తుతం జై లవకుశ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న NTR పలు ఛానెళ్ళకు ఇంటర్వ్యూలు ఇస్తూ పలు ఆసక్తికర విషయాలు చెప్తున్నాడు. అలాగే టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి హ్యాట్రిక్ హిట్స్ తో పాటు బిగ్ బాస్ షో సూపర్ హిట్టవడం తో మాంఛి ఫాం లో ఉన్నాడు ప్రస్తుతానికి. అలాగే త్రివిక్రం, కొరటాల లాంటి దర్శకుల సినిమాల తో లైనప్ కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. సరిగ్గా ఇప్పుడే చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులేస్తున్నాడు ఎన్ టీయార్.

సింహాద్రి సినిమా తర్వాత ఎన్ టీ యార్ కి ఆ స్థాయి హిట్ రావడానికి చాలా ఏళ్ళు పట్టింది. ఈ మధ్యలో సినిమాలు ఫ్లాపులు కావడం తో పాటు ఇతరత్రా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. వాటిలో ఒకటి – బాలకృష్ణ అభిమానులకి, ఎన్ టీయార్ అభిమానులకి మధ్య గ్యాప్ పెరగడం ఒకటి. కొడాలి నాని వైసిపి లో జాయినయి ఫ్లెక్సీల్లో సీనియర్ ఎన్ టీయార్ ఫోటోలు పెట్టినపుడు కొంత రగడ జరిగి బాలకృష్ణ మీడియాముఖంగా కొన్ని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అలాగే సింహాద్రి సూపర్ హిట్టయ్యాక “అగ్ర స్థానమే నా లక్ష్యం” అంటూ ఇండియా టుడే కి ఇచ్చిన ఇంటర్వ్యూ మొదలుకుని ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యం లో మెగా అభిమానులు కూడా ఎన్ టీయార్ కి కొంత దూరం అయ్యారు. అంతే కాక మధ్యలో బృందావనం లాంటివి ఒకట్రెండు సినిమాలు తీసినా, మొదటి నుంచీ మాస్ కథాంశాలు ఎన్నుకోవడం వల్ల మహిళా ప్రేక్షకులకి, ఫ్యామిలీ ఆడియెన్స్ కి కూడా అంత దగ్గర కాలేకపోయాడు.

అయితే ఇప్పుడు ఒక్కొక్క మైనస్ ని ఎన్ టీ యార్ జాగ్రత్తగా ప్లస్ గా మార్చుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇటీవలి జైలవకుశ ప్రమోషన్స్ లో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూల్లో బాలకృష్ణ సినిమాల్లో తనకి నచ్చిన డైలాగులని చెప్పి ఇటు బాలయ్య అభిమానులని ఆకట్టుకుంటే, బన్నీ ని తన ఫేవరెట్ డ్యాన్సర్ గా చెప్పి అటు మెగా అభిమానులని కూల్ చేసాడు. ఇక ఏ మహిళా ప్రేక్షకులైతే ఎన్ టీయార్ కి అంత దగ్గర కాదనుకున్నారో ఇప్పుడు వాళ్ళే ఎన్ టీయార్ కి అత్యంత దగ్గరైపోయారు బిగ్ బాస్ షో ద్వారా.

చూస్తుంటే మళ్ళీ మునుపటి ప్రాభవాన్ని త్వరలోనే అందుకునేట్టున్నాడు ఎన్ టీయార్. మరి జై లవకుశ ఏం చేస్తుందో ఎన్ టీ యార్ ని!!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

ప్రశాంత్ కిషోర్‌పై జగన్ తరహాలోనే దీదీ ఆక్రోశం !

టీడీపీ, బీజేపీలను గెలిపించేందుకే ప్రశాంత్ కిషోర్ పని చేస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించినట్లుగా ఓ వీడియోను వైసీపీ హైలెట్ చేస్తోంది. కానీ ఆయన క్షేత్ర స్థాయిలో వర్క్ చేయడం లేదని.. కేవలం...

సజ్జల రాజీనామా చేస్తే ఏమవుతుంది !?

ఏపీలో సలహాదారులకు కూడా కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ప్రభుత్వ సలహాదారు రాజకీయ వ్యవహారాలు మాట్లాడేందుకు వీలు లేదు. అయినా సజ్జల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close