గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీపై మాచవరం పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదు అయింది. వంశీ తన అనుచరులతో కలిసి తనపై దాడి చేశారని సునీల్ అనే వ్యక్తి మాచవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి ఆధారాలు ఉండటం తో కేసు నమోదు చేశారు.
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గన్నవరంలోని వంశీ ఇంటి వద్ద కొంత మంది టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఆ సమయంలో వంశీ సూచనలతో.. ఆయన అనుచరులు ఇరవై మంది సునీల్ సహా మరికొంత మందిపై దాడిచేశారు. ఆ దృశ్యాలు ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వంశీ ఇలా దాడులు చేయించడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది.
అయితే బాధితులు అప్పుడు ఫిర్యాదు చేయకుండా ఇప్పుడు ఎందుకు చేశారన్నది వైసీపీ వర్గాలు వేస్తున్న ప్రశ్న. వంశీ ప్రస్తుతం రాజకీయంగా యాక్టివ్ గా లేరు. అయితే ఆయన రాజకీయాలకు విరామం ఇవ్వలేదు. తన రాజకీయం తానుచేస్తున్నారు.


