ప‌వ‌న్‌కి  ఈసారీ… రోజుల లెక్క‌నే

పారితోషికాల విష‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ గేమ్ ప్లాన్ మారింది. సినిమాకింత అని కాకుండా, రోజుకి ఇంత అని తీసుకోవ‌డం మొద‌లెట్టాడు ప‌వ‌న్‌. `వ‌కీల్ సాబ్` కోసం ప‌వ‌న్‌.. ఒక్క రోజుకీ కోటి రూపాయ‌ల పారితోషికం తీసుకున్న‌ట్టు ఇండ్రస్ట్రీలో గుస‌గుస‌లు వినిపించాయి. ఇప్పుడు `అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌`కీ అదే ప‌ద్ధ‌తి పాటిస్తున్న‌ట్టు టాక్‌.

సితార ఎంట‌ర్టైన్‌మెంట్స్‌సంస్థ మ‌ల‌యాళ చిత్రం `అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌` ని రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ అడుగుపెట్టాక‌… ఈ రీమేక్ క్రేజ్ మ‌రింత పెరిగింది. మ‌రో హీరోని ఇంకా ఎంపిక చేయాల్సివుంది. అయితే.. హీరో ఎవ‌రైనా ఈ సినిమాకి కేవ‌లం రెండు నెలల్లో పూర్తి చేయాల‌ని చూస్తున్నారు. అందులోనూ ప‌వ‌న్ కేటాయించిన కాల్షీట్లు 30 మాత్ర‌మేన‌ట‌. ఈసారి కూడా ప‌వ‌న్‌కి రోజుల లెక్క‌నే పారితోషికం ఇవ్వ‌బోతున్నార్ట‌. వ‌కీల్ సాబ్ కంటే.. ప‌వ‌న్ ఇంకాస్త ఎక్కువ తీసుకోబోతున్న‌ట్టు టాక్‌. `వ‌కీల్ సాబ్‌` షూటింగ్ పూర్త‌యిన వెంట‌నే క్రిష్ సినిమా మొద‌లెట్టాలి. కానీ.. క్రిష్ చేతిలో ఇప్పుడు మ‌రో ప్రాజెక్టు వుంది. వైష్ణ‌వ్ తేజ్ తో ఓ సినిమా చేస్తున్నాడు క్రిష్‌. అది పూర్త‌య్యేలోగా.. ప‌వ‌న్ `అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్ ` రీమేక్ ని పూర్తి చేయాల‌ని భావిస్తున్నాడు. 

ప‌వ‌న్ తో ఎలా ఉంటుందంటే… తాను సెట్లో దిగేంత వ‌ర‌కూ  సినిమాల సంగ‌తి తేల‌డం చాలా క‌ష్టం. ఈ షెడ్యూళ్లు, ప్లానింగులూ ఎప్ప‌టిక‌ప్పుడు మారిపోతూ ఉంటాయి.  కాక‌పోతే ఇప్పుడు చేతిలో చాలా సినిమాలున్నాయి. అవ‌న్నీ అనుకున్నట్టు పూర్తి చేయాలంటే ప‌వ‌న్ తొంద‌ర ప‌డాల్సిందే. కాబ‌ట్టి ఈసారి `వ‌కీల్ సాబ్` మొద‌ల‌వ్వ‌గానే… అదే ఊపులో `అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌`నీ పూర్తి చేయాల‌ని భావిస్తున్నాడు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close