మంగళంపేట అడవుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం చేసిన కబ్జాలపై పవన్ కల్యాణ్ సంచలనాత్కక విషయాలే బయట పెట్టారు. నిజానికి ఇవి కొంత కాలం కిందట వైరల్ అయ్యాయి. అడవిలో ఆయన కట్టుకున్న ఇల్లుతో పాటు ప్రభుత్వ నిధులతో అక్కడికి వేసుకున్న రోడ్డు కూడా హాట్ టాపిక్ అయింది. అప్పట్లో విచారణ జరిపిన అధికారులు అడవిని కబ్జా చేశారని గుర్తించి వెనక్కి తీసుకున్నారు. కానీ పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ఏరియల్ సర్వే చేసి.. వీడియోలు తీసి ఎక్స్ పోజ్ చేస్తేనే ఎక్కువ ఫోకస్ వచ్చింది. పవన్ కల్యాణ్ బయట పెట్టిన అంశాలతో పెద్దిరెడ్డి ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారు.
బెదిరింపులకు దిగిన మిథున్ రెడ్డి
పవన్ కల్యాణ్ బయట పెట్టిన విషయాలు తప్పు అని చెప్పని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆధారాలు చూపించాలని.. సవాల్ చేశారు. లేకపోతే కేసులు వేస్తానని హెచ్చరించారు. అయితే వెంటనే అటవీ శాఖ ఉన్నతాధికారి చలపతిరావు అసలు విషయం బయట పెట్టారు. అటవీ భూముల కబ్జా వ్యవహారంలో ఏ 1గా మిథున్ రెడ్డి ఏ వన్‌గా ఉన్నారని .. కబ్జా చేసిన భూముల్ని వెనక్కి తీసుకున్నామని.. ఇంకా విచారణ కొనసాగుతోందని ప్రకటించారు. అటవీ భూముల వ్యవహారంలో ఇంకా బయటకు రావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. డీప్ గా విచారణ జరగకుండా.. మిథున్ రెడ్డి ఇలా బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా అనుమానిస్తున్నారు.
పెద్దిరెడ్డి భూకబ్జాలపై ఇక అసలు ఆట ప్రారంభం
పెద్దిరెడ్డి ఆయన కుటుంబం భూబకాసురులు అని అందరికీ తెలుసు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన, ఆయన అనుచరులు చేసిన కబ్జాల లెక్కలు ఎక్కడ బయటపడతాయో అని ఏకంగా ఆర్డీవో కార్యాలయాన్నే తగులబెట్టించారు. ఆ కేసులో కీలక అనుచరులు అరెస్టు అయ్యారు. తిరుపతి దగ్గర.. ఇతర చోట్ల ఆయన చేసిన కబ్జాల గురించి బయటకు వచ్చాయి. కొన్ని చోట్ల స్వాధీనం చేసుకున్నారు. పుంగనూరులో తన ఇంటికి వేసుకున్న రోడ్డు కూడా కబ్జా చేసిన స్థలంలో… ప్రభుత్వ నిధులతో వేసుకుందే. ఆ దారిని పబ్లిక్ కు ఓపెన్ చేయాలని కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. అసలు సంబంధమే లేని భూములు వారి పేర్లపైకి ఎలా మారాయో పలు విచారణలు జరుగుతున్నాయి. అవన్నీ కొలిక్కి రావాల్సి ఉంది.
పెద్దిరెడ్డి కేసుల్ని దారికి తెస్తేనే ఇతరులు దారికి వస్తారు !
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద చేప కాదు.. అంతకు మించి తిమింగలం. ఆయను పాపాల పెద్దిరెడ్డి అంటారు. ప్రజల్ని దోచుకవడం వెన్నతో పెట్టిన విద్య. ఆయన లెక్కలు తేల్చకపోతే.. ప్రభుత్వానికి చేతకాదని అనుకుంటారు. పుంగనూరులో ఇతరుల్ని అడుగు పెట్టనిచ్చేవారు కాదు. దాడులు చేసేవారు. ఇళ్లు కట్టుకుంటే కూలగొట్టేవారు. చంద్రబాబుపై పుంగనూరులో జరిగిన హత్యాయత్నం, దాడుల వెనుక పెద్దిరెడ్డి ఉండరని ఎవరు అనుకుంటారు. రాజకీయంగా కూడా ఆయన అత్యంత ఘోరమైన మనిషి. ఆయనను ఉపేక్షిస్తే.. ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారని రాజకీయాల నుంచి వైదొలిగినట్లుగా నాటకాలు ఆడుతున్నారని వదిలి పెడితే…ఆయన రేపు మరింత ఎక్కువ చేస్తారు. అందుకే పవన్ కల్యాణ్.. ఆయన కేసును స్వయంగా టేకప్ చేశారు. ఓ దారికి తెస్తారని అనుకోవచ్చు.
