ఏం చేస్తున్నా ఒక్క సారి కూడా అరెస్టు చేయడం లేదని.. ముందస్తు బెయిల్ తీసుకుని హాయిగా ఉంటున్నానని పేర్ని నానికి అలుసు అయిపోయింది. శుక్రవారం రోజు ఆయన నేరుగా పోలీస్ స్టేషన్లోనే రుబాబు చేశారు. అనుమతి లేని ధర్నాలు చేసి కేసులు పాలైన వారిని విచారణ కోసం స్టేషన్కు పిలిపించినందుకు పేర్ని నాని నేరుగా ఎస్ఐపై రుబాబు చేశారు. ఆయన పోలీసులపై రెచ్చిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పేర్ని నాని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా పోలీసులపై, పోలీస్ స్టేషన్లపై దాడులు చేశారు. కేసులు కూడా నమోదయ్యాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఈ తరహా దాడులు చేసిన చరిత్ర ఉంది. కానీ ఎప్పుడూ అరెస్టు కాలేదు. ప్రభుత్వం మారిన తర్వాత ఆయన చేసిన నిర్వాకాల కారణంగా వెంటనే అరెస్టు అవుతారని అనుకున్నారు.
కొల్లు రవీంద్రపై తప్పుడు కేసులు పెట్టించి అరెస్టు చేసిన రికార్డు ఆయనకు ఉంది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన హాయిగానే ఉన్నారు. బియ్యం స్కాంలో ఆయన భార్యపై కేసు నమోదు అయితే ఆమెను తీసుకుని ఆజ్ఞాతంలోకి పోయి.. ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇతర కేసుల్లోనూ అంతే. తనను అరెస్టు చేయడం లేదు కాబట్టి అలుసుగా తీసుకుని పేర్ని నాని రెచ్చిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆయనకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఇంకా రెచ్చిపోతారని .. ఎందుకు ఉపేక్షిస్తున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి..