ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్తగా విచారణ ప్రారంభించింది సిట్ . అంతే మీడియాకు కొత్త లీకులు వస్తున్నాయి. తాజాగా త్వరలో మాజీ సీఎం తో పాటు ఇద్దరు మంత్రులకు సిట్ నోటీస్ లు ఇచ్చే అవకాశం ఉందని సమాచారం లీక్ అయింది. ఇక్కడ మాజీ సీఎం అంటే ఎవరో లేరు కేసీఆర్ మాత్రమే. ఇద్దరు మాజీ మంత్రులు అంటే కేటీఆర్ హరీష్ రావు. అసెంబ్లీ సమావేశాల తర్వాత నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
అప్పటి ప్రభుత్వ పెద్దలైన కెసిఆర్, హరీష్, కేటీఆర్ ల కోసం ట్యాపింగు చేసినట్లు ప్రభాకర్ రావు వాంగ్మూలం ఇచ్చారని చెబుతున్నారు. ఒక ఛానల్ ఎండి తో కలిసి హరీష్ రావు ట్యాపింగ్ చేయించారని.. కొంతమంది కోసం కేటీఆర్ ట్యాపింగ్ చేసినట్లు చేయించారని గుర్తించినట్లుగా చెబుతున్నారు. ఇవన్నీ కొత్తగా ట్విస్టులు అని మీడియాకు సమాచారం ఇస్తున్నారు. కానీ అన్నీ పాత విషయాలే.
ఫోన్ ట్యాపింగ్ పై మొదట విచారణ ప్రారంభించినప్పుడు కూడా ఇలాగే సంచలన లీకులు వచ్చేవి.కానీ కేసీఆర్ కు నోటీసులు జారీ చేయలేదు. హరీష్, కేటీఆర్ లకూ జారీ చేయలేదు. ఇప్పుడు సజ్జనార్ స్థాయి అధికారి విచారణ బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి ఆయన మళ్లీ పాత విషయాలను కొత్తగా బయటకు తీస్తున్నారు. ఇది కూడా ప్రచార ఆర్భాటంలా మిగిలిపోతుందా.. ఏమైనా సమాచారం బయటకు తీయగలుగుుతారా అన్నదే సామాన్యులకు ఇంకా క్లారిటీ రాని విషయం.
