పింక్ టెస్ట్‌ : తొలి రోజు బంగ్లాను ఆటాడుతున్న టీమిండియా..!

పింక్ బాల్ పరేషాన్ చేసింది. టైగర్లమంటూ.. చెలరేగిపోయేందుకు వచ్చి… ఈడెన్‌లో చల్లబడిపోయారు..బంగ్లాదేశ్ క్రికెటర్లు. పింక్ బాల్ కు భారత ఫాస్ట్ బౌలర్ల స్వింగ్ తోడవడంతో… బంగ్లా ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలిపోయింది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో వారు 30 ఓవర్లు మాత్రమే ఆడగలిగారు. 106 పరుగులకు ఆలౌటయ్యారు. ఇందులో 14 పరుగులు ఎక్స్ ట్రాల రూపంలోనే వచ్చాయి. భారత బౌలర్లలో “లంబూ” ఇషాంత్ శర్మ ఐదు వికెట్లు, ఉమేష్ యాదవ్ మూడు, షమీ రెండు వికెట్లతో పండగ చేసుకున్నారు. పింక్ బాల్ భారత బ్యాట్స్ మెన్ ను ఇబ్బంది పెట్టినప్పటికీ.. వారు నిలదొక్కుకున్నారు. తొలి రోజే.. ఆధిక్యంలోకి వెళ్లిపోయారు.

ఈ జోరు ఇలా సాగితే.. తొలి టెస్టులాగే.. మూడు రోజుల్లోనే.. పింక్ టెస్ట్ కూడా ముగిసే అవకాశం ఉంది. పింక్ బాల్ ఎలా స్పందిస్తుందో బంగ్లాదేశ్ ఆటగాళ్లు అంచనా వేయలేకపోయారు. టీమిండియా ఆటగాళ్లు ముందుగానే కఠోర సాధన చేయడం కలిసి వచ్చింది. ఏడేళ్ల క్రితమే డే అండ్‌ నైట్ టెస్టు మ్యాచ్‌లకు ఐసీసీ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు భారత్ ఒక్క డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌ కూడా ఆడలేదు. ఇదే మొదటిసారి. ఈడెన్ టెస్ట్ చరిత్రలో నిలిచిపోనుంది. అటు ఫలితంగానూ.. ఇటు పింక్ బాల్ తోనూ… క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ప్రత్యేకంగా లిఖించుకుంటుంది.

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలు గంట మోగించి అధికారికంగా మ్యాచ్‌ను ప్రారంభించారు. ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ పగ్గాలు చేపట్టడం.. టీమిండియా సైతం డే నైట్ టెస్ట్ ఆడతామని అంగీకరించడంతో అతి తక్కువ సమయంలో ఈ డే నైట్ టెస్ట్‌కు ఈడెన్ గార్డెన్స్ ను ముస్తాబు చేశారు. అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close