గురూజీ కూడా ఫైన్ కట్టారు

వాహనాలకు ఉన్న బ్లాక్‌ స్టిక్కర్లు, బ్లాక్‌ ఫిల్మ్‌లను తొలగించాలని కోర్టు ఆదేశాలు ఎప్పటి నుంచో వున్నాయి. మహిళలపై లైంగిక దాడులు, దొంగతనాలు, కిడ్నాపులకు పాల్పడేవారు ఈ బ్లాక్ ఫిల్మ్ వున్న వాహనాలు ఉపయోగించి తప్పించుకున్నట్లు పలు విచారణలులో తేలడంతో కోర్టు సదరు ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయంలో తాజాగా తెలంగాణ పోలీసులు కాస్త గట్టిగానే తనిఖీలు చేస్తున్నారు. బ్లాక్ ఫిల్మ్ వాడుతూ ఎవరు దొరికిన అక్కడికక్కడికే అవ తొలగించి ఫైన్ వేస్తున్నారు. ఇటీవల మంచు మనోజ్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, కల్యాణ్‌రామ్‌ కార్లకు ఉన్న బ్లాక్‌ ఫిల్మ్‌లను పోలీసులు తొలగించి ఫైన్‌ వేసిన సంగతి తెలిసిందే.

తాజాగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఫైన్ లిస్టు లో చేరారు. జూబ్లీహిల్స్‌ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేసిన పోలీసులు.. అటుగా వెళ్తోన్న త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కారుని ఆపారు. ఆయన కారుకు ఉన్న బ్లాక్‌ ఫిల్మ్‌ తొలగించి జరిమనా విధించారు. ఆ సమయంలో త్రివిక్రమ్‌ కారులోనే ఉన్నారు. ఈ విషయంలో పోలీసులకు ఆయన సహకరించారు. అయితే కొన్ని రోజులుగా ముమ్మరంగా తనిఖీలు జరుగుతున్న ఘటనలు వెలుగుస్తున్నప్పుడు స్వచ్చందంగా బ్లాక్ ఫిల్మ్ ని తలగించకోకుండా ఇలా ఫైన్ వరకూ తెచ్చుకోవడం గమనార్హం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close