అబ్ ప్రత్యేకహోదా దూర్ నహీ హై!

ఏపీలో మళ్ళీ ఇప్పుడు అందరూ ప్రత్యేకహోదా జపం చేయడం మొదలు పెట్టారు. ఒకళ్ళు జపం చేస్తుంటే మరొకరు చేయకపోతే జనాలు శపిస్తారనే భయంతో ఒకళని చూసి మరొకరు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రత్యేక జపం చేయవలసి వస్తోంది. మొదట్లో ఇదేదో తెదేపా-బీజేపీలకి సంబందంచిన అంతర్గత వ్యవహారమన్నట్లు కాంగ్రెస్, వైకాపాలు పట్టించుకోలేదు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బ్రతికి బట్ట కట్టాలంటే ఇదే తారకమంత్రం దీనిని నిత్యం జపిస్తే రాష్ట్ర విభజన చేసిన దోష పరిహారం జరుగుతుందని, అప్పుడే ప్రజలు కూడా శాంతించి మళ్ళీ కరుణిస్తారని ఎవరో కాంగ్రెస్ జ్యోతిష్యుడు కనిపెట్టి చెప్పడంతో అప్పటి నుండి కాంగ్రెస్ జీవులన్నీ చాలా నిష్టగా సామూహిక ప్రత్యేక జపాలు చేయడం ఆరంభించాయి. అయినా అప్పటికీ రాష్ట్రంలో ఇతర రాజకీయ జీవులు మేల్కోక పోవడం విచిత్రమే!

 

“ఇలాగ విజయవాడలోనో, హైదరాబాదులోనో ప్రత్యేక జపాలు ఎన్నిరోజులు చేస్తే మాత్రం ఏమి ఫలితం ఉంటుంది? డిల్లీలో మోడీ చుట్టూ తిరుగుతూ మోడీ జపం చేయాలి” అని తెదేపా జీవులు డిల్లీలో జపం చేయడం మొదలుపెట్టాయి. అక్కడ వాళ్ళు ఇక్కడా వీళ్ళు ఎవరి జపాలు వారు చాలా ప్రశాంతంగా తమకు తోచిన రీతిలో చేసుకుపోతున్నారు. మధ్యమధ్య శివాజీ కేకలు, పవన్ కళ్యాణ్ పలవరింతలు తప్ప ఎక్కడా పెద్దగా డిస్టర్బెన్స్ లేదు.

 

కానీ పార్లమెంటు వెనుక బెంచీలలో హాయిగా కునుకు తీయకుండా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్దరిస్తానంటూ వచ్చి రాహుల్ గాంధీ అందరినీ కెలికి వెళ్ళిపోవడంతో అందరికీ మళ్ళీ ప్రత్యేక జ్వరం వచ్చేసింది. ఆయన  వచ్చినంత వేగంగా తిరిగి వెళ్ళిపోతూ “మీ అందరికీ మోడీ అంటే భయం..అందుకే ఇక్కడే కూర్చొని ప్రత్యేక జపాలు చేసుకొంటూ కాలక్షేపం చేస్తున్నారు” అని వైకాపాని గిల్లి వెళ్లిపోయాడు. అంతే అప్పుడే “మనం మారాల్సిన టైం వచ్చేసింది…అర్జెంటుగా డిల్లీ వెళ్ళడానికి అందరూ రెడీ అయిపోండి” అని జగన్మోహన్ రెడ్డి ఆర్డర్ వేసేశాడు. “అంటే వైకాపా నుండి కాంగ్రెస్ లోకి మారాల్సిన సమయం వచ్చేసింది…డిల్లీ వెళ్లి సోనియా, రాహుల్ గాంధీల సమక్షంలో తమ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేద్దామంటున్నాడేమో మన గురుడు?” అని వైకాపా జీవులన్నీ కొంచెం కన్ఫ్యూజ్ అయిన మాట వాస్తవం. కానీ “అందుక్కాదు…దానికింకా చాలా టైముంది…ముందు డిల్లీ వెళ్లి అక్కడే ప్రత్యేక జపం చేసి మన తడాకా ఏమిటో ఆ మోడీకి చూపిద్దామని” జగన్ మనసులో మాటని చెప్పేసరికి అందరికీ హుషారు వచ్చేసింది.

 

ఎందుకంటే “అందరితో బాటు తాము ప్రత్యేక జపం చేయడం లేదని అధికార పార్టీయే కాదు జనాలు కూడా తమని చాలా అనుమానంగా చూస్తుంటే ఆ చూపులు తట్టుకోవడం చాలా కష్టంగా ఉందని” మేకపాటి వారు పార్లమెంటులో చెప్పుకొన్నారు. అందరి కంటే చాలా ముందు నుండే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకజపం చేస్తోంది కనుక దానిమీద తమ పార్టీకే పేటెంట్ రైట్స్ ఉంటాయని నిశ్చింతగా ఉంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా రెండు రైళ్ళ నిండా జనాలనేసుకొని తమకు పోటీగా వస్తుండటం కాంగ్రెస్ జీవులు జీర్ణించుకోవడం కొంచెం కష్టమే. కానీ తప్పదు ఎందుకంటే రాహుల్ గాంధీ ఊసుపోక చేసిన పనికి మూల్యం చెల్లించక తప్పదు మరి.

 

పాపం కాంగ్రెస్ ఎంపీలు సస్పెండ్ అయ్యి బయట ధర్నాలు చేసుకొంటుంటే ఇదే అవకాశం అని వైకాపా ఎంపీలు సభ లోపల చెలరేగిపోయారు. చివరికి వారి గోల భరించలేక అన్ని హామీలు అమలు చేస్తామని హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ హామీ ఇవ్వాల్సి వచ్చింది. అది చూసి తెదేపా జీవులకి చాలా కోపం వచ్చే ఉంటుంది. ఇన్నాళ్ళుగా తామందరం మోడీ చుట్టూ నిష్టగా ప్రదక్షిణలు చేస్తున్నా ఎప్పుడూ కూడా ఇలాగ హామీ ఇవ్వలేదు. కానీ వైకాపా నేతలు ఒక్క రోజు సభలో కొంచెం వాయిస్ రెయిజ్ చేసేసరికి సరే అనేయడమేనా? అని చాలా హర్ట్ అయిపోయారు. అయినా మొన్న మీ ఇంద్రజిత్ సింగు ఇక ప్రత్యేకహోదా ఇవ్వమని చెప్పిన తరువాతనే కదా మా రాయపాటి సాంభశివరావు , జేసీలు అలాగా టంగు స్లిప్పయ్యారు. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకహోదా ఇస్తామంటున్నారేమిటి? అని తెదేపా జీవులు కొంచెం తికమకపడుతున్నాయి.

 

ఏమయినప్పటికీ ఇప్పుడు అందరూ డిల్లీకి షిఫ్ట్ అయిపోతున్నారు. ఒకవేళ ప్రత్యేకహోదా వస్తుందో రాదో తెలియదు. కానీ వస్తే అది ఎవరి వల్ల వచ్చిందో కనిపెట్టాల్సిన బాధ్యత మాత్రం తెలుగు ప్రజలదే! కానీ రాకపోతే మాత్రం ఆ పాపం మొత్తం తెదేపా-బీజేపీలాదే అందులో డౌటే లేదు!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలిచ్చిన రేవంత్ రెడ్డి !

జర్నలిస్టులు సుదీర్ఘంగా చేస్తున్న పోరాటం ఫలించింది . జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ కింద గతంలో కేటాయించిన భూమిని ఇప్పుడు రేవంత్ రెడ్డి హ్యాండోవర్ చేశారు. ఈ భూమికి ఒక్కో జర్నలిస్టు...

కూల్చివేతలపై హైడ్రా కీలక నిర్ణయం!

ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా వరుసగా కొరడా ఝులిపిస్తోంది. ఓ వైపు హైడ్రా పనితీరుపై ప్రశంసల జల్లు కురుస్తున్నా..మరోవైపు ఉన్నపళంగా భవనాలను కూల్చివేస్తుండటంపై తీవ్ర విమర్శలు...

జయభేరీది కార్ సర్వీసింగ్ సెంటర్ !

జయభేరీ మూడున్నర దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉంది కానీ ఇప్పటి వరకూ ఆ సంస్థపై చిన్న ఆరోపణ రాలేదు. క్లీన్ ఇమేజ్ తో వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్న సంస్థ. అయితే...

దివ్వెలకు ఇల్లు రాసిచ్చేసిన దువ్వాడ !

దివ్వెల మాధురీ పది రోజులు సైలెంట్ గా ఉంటానంటే.. అందరూ ఏంటో అనుకున్నారు. ఈ పది రోజుల్లో ఆమె సైలెంట్ గా తన పని తాను పూర్తి చేసుకుంది. టెక్కలిలో ఉన్న దువ్వాడ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close