చేసింది రెండే రెండు సినిమాలు. అయితేనేం.. పాన్ ఇండియా స్థాయిలో క్రెడిబులిటీ తెచ్చుకొన్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తను కథ చెప్తానంటే టాప్ స్టార్లంతా క్యూ లో నిలబడతారు. సందీప్ సంపాదించిన స్థాయి అది. ప్రస్తుతం ప్రభాస్ తో ‘స్పిరిట్’ రూపొందిస్తున్నాడు. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఓ ఆడియో స్టోరీ బయటకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు వర్క్ ఎప్పుడో పూర్తయ్యింది. సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి. నవంబరులో షూటింగ్ మొదలవుతుందన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. ఒక్కసారి సినిమా సెట్స్ పైకి వెళ్తే.. త్వరితగతిన పూర్తి చేసేస్తార్ట. కేవలం 100 రోజుల్లోపే షూట్ పూర్తయిపోతుందని, సందీప్ అంత ప్రిపేర్డ్ గా ఉన్నాడని టాక్.
మరోవైపు మహేష్ బాబు కోసం సందీప్ రెడ్డి ఓ కథ సిద్దం చేస్తున్నాడు. ప్రభాస్ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు ఎప్పుడో లాక్ అయిపోయింది. ఇక ఆ సినిమా గురించి బెంగ లేదు. ఈ గ్యాప్ లో మహేష్ కు సరిపడా ఓ కథని సందీప్ సిద్ధం చేస్తున్నాడని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అందుకోసం ఓ టీమ్ ప్రత్యేకంగా పని చేస్తోందట. రాజమౌళి సినిమా పూర్తవ్వగానే మహేష్ – సందీప్ కాంబోలో సినిమా మొదలయ్యే ఛాన్స్ వుంది. ‘అర్జున్ రెడ్డి’ తరవాత సందీప్ తో మహేష్ భేటీ వేశాడు. కొన్ని కథలు చర్చించుకొన్నారు. కానీ వర్కవుట్ కాలేదు. కానీ సందీప్ తో ఓ సినిమా చేయాలని మహేష్ బలంగా ఫిక్సయ్యాడు. రాజమౌళి ప్రాజెక్ట్ తరవాత సందీప్తోనే జట్టుకట్టే అవకాశం ఉంది. మహేష్ ఎప్పుడు ఫ్రీ అవుతాడన్న విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. కానీ మహేష్ నుంచి పిలుపు రాగానే, ఏమాత్రం ఆలస్యం చేయకూడదన్న ఉద్దేశ్యంతో సందీప్ ముందస్తుగానే స్క్రిప్టు పనులు మొదలెట్టేశాడు.
రాజమౌళి – మహేష్ సినిమా పూర్తయ్యేసరికి, స్పిరిట్ పనులు ముగించి సిద్ధంగా ఉండాలన్నది సందీప్ ఆలోచన. అందుకు తగ్గట్టుగానే ప్రణాళికా బద్ధంగా పని చేస్తున్నాడు. త్వరలోనే సందీప్ రెడ్డి – మహేష్ మధ్య ఓ కీలక భేటీ జరగబోతోంది. ఆ తరవాత ఈ ప్రాజెక్ట్ పై మధ్య ఓ కీలక భేటీ జరగబోతోంది. ఆ తరవాత ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
