షాకింగ్ : సాహో టీజ‌ర్ లీక్‌

లీకేజీల బెడ‌ద ముదిరిపోయింది. పెద్ద సినిమాల‌కు లీకేజీ స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌వుతోంది. బాహుబ‌లి 2కి సంబంధించిన కొన్ని వీడియోలు లీకైపోయిన‌ట్టు, వాటికి సంబంధించిన ఫొటోలు చూస్తే అర్థం అవుతోంది. ఇప్పుడు సాహో టీజ‌ర్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ప్ర‌భాస్ – సుజిత్ ల కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమా సాహో. బాహుబ‌లి 2 తో పాటు సాహో టీజ‌ర్‌నిచూపించ‌బోతున్నారు. ఈనెల 28 చూడాల్సిన టీజ‌ర్‌ని లీకేజీ వ‌ల్ల ముందే చూసేస్తున్నారు అభిమానులు.

మొహ‌మంతా ర‌క్తం మ‌ర‌క‌ల‌తో ఉన్న ప్ర‌భాస్‌ని చూసి – “ర‌క్తం వ‌చ్చిన‌ట్టు కొట్టార్రా..“ అంటూ ప్ర‌భాస్‌ని ఉద్దేశించి విల‌న్ ఓ డైలాగ్ చెబుతాడు. “అది వాడి ర‌క్తం కాదు.. మ‌న ర‌క్తం“ అని విల‌న్ గ్యాంగ్‌లో మ‌రొక‌రి డైలాగ్ వినిపించింది. ఈ టీజర్ ని య‌మ స్టైలీష్‌గా క‌ట్ చేశాడు సుజిత్‌. టీజ‌ర్‌తోనేసాహో పై భారీ అంచ‌నాలు మొద‌లైపోవ‌డం ఖాయం. బాహుబ‌లి ఫేస్ క‌ట్‌తో ప్ర‌భాస్‌ని చూసీ చూసీ విసుగొచ్చిన వాళ్ల‌కు టీజ‌ర్‌లో కొత్త లుక్‌తో క‌నిపించాడు ప్ర‌భాస్. ప్ర‌భాస్ సాహో ముందే చూసేశామ‌ని సంతృప్తి పడాలో, టీజ‌ర్ లీకైంద‌ని ఫీల్ అవ్వాలో ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి సైతం అర్థం కావ‌డం లేదు. బాహుబ‌లి 2 సెన్సార్ దుబాయ్‌లో జ‌రిగిన‌ప్పుడు అక్క‌డెవ‌రో సినిమాని సెల్‌ఫోన్‌లో చిత్రీక‌రించిన‌ట్టు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. మ‌రి ఏం జ‌రిగిందో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com