ప్ర‌మోష‌న్ల‌కు దూరంగా ప్ర‌భాస్‌

యూవీ క్రియేష‌న్స్ సినిమా అంటే ఓ విధంగా ప్ర‌భాస్ సినిమానే అనుకోవాలి. ఎందుకంటే… యూవీ సంస్థ‌కూ ప్ర‌భాస్‌కీ అంత అవినాభావ సంబంధం ఉంది. యూవీకి ప్ర‌భాస్ అన‌ధికార నిర్మాత‌. ఆ సంస్థ నుంచి వ‌చ్చిన ప్ర‌తీ సినిమాకీ ప్ర‌త్య‌క్షంగానూ, ప‌రోక్షంగానూ త‌న స‌హాయం అందిస్తుంటాడు ప్ర‌భాస్‌. ‘భాగ‌మ‌తి’ విష‌యంలో ప్ర‌భాస్‌దే కీల‌క పాత్ర అన్న‌ది టాలీవుడ్ జ‌నాల న‌మ్మ‌కం. ఈ ప్రాజెక్టు సెట్ కావ‌డానికి, అనుష్క టీమ్‌లోకి రావ‌డానికి ప్ర‌భాస్ కాస్త చొర‌వ చూపించాడ‌ని తెలుస్తోంది. ఇప్పుడు ‘భాగ‌మ‌తి’ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో ప్ర‌భాస్ పాల్గొంటాడ‌ని విస్ర్కృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. ప్ర‌భాస్ మాత్రం ‘భాగ‌మ‌తి’కి దూరంగా ఉండాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. `భాగ‌మ‌తి` ప్రీ రిలీజ్ వేడుక ప్ర‌స్తుతం హైదారాబాద్ లో జ‌రుగుతోంది. దీనికి ప్ర‌భాస్ అతిథిగా వ‌స్తాడ‌ని గ‌ట్టిగా ప్ర‌చారం జ‌రిగింది. అయితే.. ప్ర‌భాస్ మాత్రం డుమ్మా కొట్టేశాడు. దీనికే కాదు.. ‘భాగ‌మ‌తి’కి సంబంధించిన ఓ ఈవెంట్ లోనూ పాలుపంచుకోకూడ‌ద‌ని డిసైడ్ అయ్యాడ‌ట‌. ప్ర‌భాస్ – అనుష్క‌ల‌తో ఓ వీడియో ఇంట‌ర్వ్యూ చేసి వ‌ద‌లాల‌న్న‌ది యూవీ క్రియేషన్స్ ఆలోచ‌న‌. దానికి కూడా ప్ర‌భాస్ సున్నితంగా నో చెప్పాడ‌ని తెలుస్తోంది. ‘భాగ‌మ‌తి’ ప్ర‌మోష‌న్ల‌కు ప్ర‌భాస్‌దూరంగా ఉండ‌డానికి ప్ర‌త్యేక‌మైన కార‌ణాలున్నాయా? లేదంటే ‘సాహో’ ఒత్తిడిలో బిజీగా ఉన్నాడా? అనే ఆస‌క్తి నెల‌కొందిప్పుడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.