ప్రకాశం జిల్లా రివ్యూ : అభ్యర్థుల ఖరారులో రెండూ పార్టీల్లోనూ సిగపట్లు..!

ప్రకాశం జిల్లాలో అటు తెలుగుదేశం.. ఇటు వైసీపీల్లో పరిస్థితి ఒకేలా ఉంది. బలమైన అభ్యర్థుల పేరుతో బయట నేతల్ని చేర్చుకున్న వైసీపీ అధినేత.. సొంత పార్టీలో.. సొంత కుటుంబంలో రేగుతున్న అసంతృప్తిని పరిగణించలేకపోయారు. అటు టీడీపీ అధినేత..బలమైన అభ్యర్థుల పేరుతో… ఇష్టం లేని చోట పోటీకి నేతల్ని పంపించారు. దీంతో.. రెండు పార్టీల్లోనూ.. పరిస్థితి భిన్నంగా ఉంది. గత ఎన్నికల్లో వైసీపీ ఈ జిల్లాలో ఆధిక్యం చూపించింది. కొంత మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడంతో… పరిస్థితి మారిపోయింది.

ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీలో చేరడాన్ని జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి వ్యతిరేకిస్తున్నారు. మాగుంటకు ఒంగోలు ఎంపీ స్థానం ఖరారు చేయనుండడంతో సుబ్బారెడ్డి తీవ్రంగా అసంతృప్తికి గురయ్యాయి. పార్టీ శ్రేణులకు, నాయకులకు ఆయన అందుబాటులోకి రావడం లేదు. మాగుంట చేరిక కార్యక్రమంలో పాల్గొనలేదు. పార్టీ కీలక నాయకులు ఫోన్లు చేసినా అందుబాటులోకి రాలేదని తెలిసింది. జిల్లాలోనూ ఆయన వర్గం నాయకులు పార్టీ తీరుపై గుర్రుగా ఉన్నారు. ఈ వ్యవహారం ఎక్కడి వరకు దారి తీస్తుందో అంటూ పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలోనే.. వైవీ సుబ్బారెడ్డి వర్గానికి చెందిన వారంటూ.. చాలా మందిని సమన్వయకర్తలుగా తొలగించేశారు. దాంతో వారందరితో కలిసి ఏదైనా నిర్ణయం తీసుకుంటారా.. అన్న చర్చ నడుస్తోంది.

తెలుగుదేశం పార్టీలో అసంతృప్త నేతల పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. కనిగిరి, దర్శి టికెట్ల వ్యవహారం తెదేపాలో ఎటూ తేలడం లేదు. దర్శి నుంచి పోటీ చేసేందుకు అటు కదిరి బాబూరావు, ఇటు ఉగ్ర నరసింహారెడ్డిలలో ఏ ఒక్కరూ ఆసక్తి చూపకపోవడం, మరోవైపు మంత్రి శిద్దా తమ కుటుంబంలో ఒకరికి దర్శి టిక్కెట్‌ ఇవ్వాలని కోరడంతో పార్టీ అదే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి శిద్దా తనయుడు సుధీర్‌ పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. అటు కనిగిరిలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. యర్రగొండపాలెం టీడీపీ టిక్కెట్‌ అజితారావుకు కేటాయించడంతో ఇటు డేవిడ్‌రాజు వర్గీయులు అసమ్మతిని రాజేస్తున్నారు.

సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ వారం రోజుూ… అదే పరిస్థితి ఉంటుంది. చివరి క్షణం వరకూ.. కొన్ని టిక్కెట్లు ఖరారయ్యే అవకాశం లేదని చెబుతున్నారు. దీంతో.. ప్రకాశం జిల్లాలో వారం పాటు… అసంతృప్త జ్వాలలు ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close