నిజమైన నాయకుడు విజయానికి బాధ్యత తీసుకుంటాడు, కానీ ఆ క్రెడిట్‌ను తన టీమ్‌కు ఇస్తాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఇదే సూత్రాన్ని ఫాలో అవుతారు. ఎకనామిక్ టైమ్స్ సంస్థ ఆయనకు బిజినెస్ రిఫార్మర్ అవార్డును ప్రకటించినప్పుడు, ఆయన దానిని కేవలం తన వ్యక్తిగత ఘనతగా చూడలేదు. ఆ సంస్కరణల అమలుకు భాగమైన వారందరికీ క్రెడిట్ ఇచ్చారు. విందు కూడా ఇచ్చారు. డిన్నర్ విత్ ది రియల్ విన్నర్స్ పేరుతో ఆయన ఏర్పాటు చేసిన ఆత్మీయ విందు, పాలకుడికి , యంత్రాంగానికి మధ్య ఉండాల్సిన అనుబంధానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది.
అసలైన విజేతలకు క్రెడిట్
సాధారణంగా ఇలాంటి అవార్డులు వచ్చినప్పుడు అవి కేవలం క్యాబినెట్ స్థాయి సంబరాలకే పరిమితమవుతాయి. కానీ, చంద్రబాబు ఒక అడుగు ముందుకు వేసి సచివాలయ అధికారులు, సెక్రటరీలతో పాటు జిల్లా, మండల స్థాయిల్లో అద్భుతంగా పనిచేసిన చిన్న స్థాయి ఉద్యోగులను కూడా ఈ విందుకు ఆహ్వానించారు. నేను కేవలం విజన్ ఇస్తాను.. కానీ దానిని క్షేత్రస్థాయిలో అమలు చేసి ఫలితాలను తీసుకొచ్చేది మీరే. అందుకే ఈ అవార్డులో సింహభాగం మీదే ” అని ఆయన ప్రకటించడం ఆ అధికారుల్లో అంతులేని ఆత్మవిశ్వాసాన్ని నింపింది. నాయకుడి పట్ల టీమ్‌కు ఉండే గౌరవం ఎప్పుడూ ఇలాంటి ఆత్మీయతతోనే పెరుగుతుంది.
సంస్కరణల డీఎన్ఏ.. సమిష్టి కృషి
చంద్రబాబు నాయుడు డీఎన్ఏలోనే సంస్కరణలు ఉంటాయని పయ్యావుల కేశవ్ చెప్పారు. అది పొగడ్త కాదు. 1995 నుండే ఐటీ, టెలికాం, విద్యుత్ వంటి రంగాల్లో ఆయన తెచ్చిన విప్లవాత్మక మార్పులు ఈ రోజు ఏపీని గ్లోబల్ మ్యాప్‌లో నిలబెట్టాయి. అయితే, ఆ విజన్ విజయవంతం కావాలంటే పటిష్టమైన యంత్రాంగం అవసరమని ఆయనకు బాగా తెలుసు. ఐదేళ్ల విచ్ఛిన్నకర పాలన తర్వాత, ప్రభుత్వ వ్యవస్థలను మళ్లీ గాడిలో పెట్టి, పెట్టుబడులను ఆకర్షించడంలో అధికారుల టీమ్ వర్క్ అద్భుతమని ఆయన గుర్తించారు. ఈ రియల్ విన్నర్స్ వల్లే మళ్లీ పెట్టుబడిదారులకు రాష్ట్రంపై నమ్మకం కలిగింది.
ఇగోలు లేని పనితీరు.. లోకేష్ చెప్పిన సత్యం
మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు అత్యంత కీలకం. పరిపాలనలో చంద్రబాబుకు ఎలాంటి అహం ఉండదని, కేవలం ఫలితం కోసమే ఆయన తాపత్రయపడతారని చెప్పారు. ఒక పారిశ్రామికవేత్తను ఒప్పించి రాష్ట్రానికి తీసుకురావడానికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఒక సామాన్యుడిలా వారితో చర్చిస్తారని, అదే స్ఫూర్తితో అధికారులు కూడా పని చేయాలని పిలుపునిచ్చారు. ఫలితం సాధించిన ప్రతిసారీ కొత్త లక్ష్యాన్ని నిర్దేశించడం ద్వారా టీమ్‌ను ఎప్పుడూ అలర్ట్‌గా ఉంచే చంద్రబాబు శైలి, ఏపీని మళ్లీ నంబర్ వన్ స్థానంలో నిలబెట్టడం ఖాయమని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.
స్వర్ణాంధ్ర దిశగా ఉమ్మడి లక్ష్యం
ఈ ఆత్మీయ విందు కేవలం విందుగానే కాకుండా, భవిష్యత్తు ప్రణాళికలకు వేదికగా మారింది. రానున్న ఐదేళ్లలో 2024-29 పాలన గురించి ప్రపంచం మాట్లాడుకునేలా చేయాలనేది సీఎం సంకల్పం. విత్తనం వేసిన వారే కాకుండా, ఆ మొక్కకు నీరు పోసి కాపాడిన ప్రతి ఒక్కరినీ గుర్తించినప్పుడు మాత్రమే ఆ వ్యవస్థ నిరంతరాయంగా పనిచేస్తుంది. చంద్రబాబు తన టీమ్‌ను రియల్ విన్నర్స్ అని పిలవడం ద్వారా వారి భుజాల మీద మరింత బాధ్యతను ఉంచారు. నాయకుడు తన విజయంలో టీమ్‌కు వాటా ఇచ్చినప్పుడు, ఆ టీమ్ తన ప్రాణాలను పణంగా పెట్టి అయినా ఆ నాయకుడి లక్ష్యాన్ని నెరవేరుస్తుందని ఈ ఉదంతం నిరూపిస్తోంది. విజయానికి వేల మంది వారసులు ఉంటారు.. కానీ ఆ వారసత్వాన్ని కష్టపడిన వారందరికీ పంచే గుణం చంద్రబాబు వంటి లీడర్‌కే సాధ్యం.
