ప్ర‌కాష్‌రాజ్‌పై అది రూమ‌రేన‌ట‌

‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌’ పేరుతో రాంగోపాల్ వ‌ర్మ ఓ చిత్రాన్ని రూపొందించే స‌న్నాహాల్లో ఉన్నారు. ఎన్టీఆర్ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతోంది. ఇందులో ఎన్టీఆర్ గా ఎవ‌రు క‌నిపించ‌బోతున్నార‌న్న విష‌యంలో ఆస‌క్తి రేగుతోంది. ఈ పాత్ర కోసం రాంగోపాల్ వ‌ర్మ ప్ర‌కాష్‌రాజ్‌ని సంప్ర‌దించార‌ని, ప్ర‌కాష్ రాజ్ కూడా ఈ చిత్రంలో న‌టించ‌డానికి అంగీక‌రించార‌ని ప్ర‌చారం జోరుగా సాగుతోంది. అయితే.. ఇదంతా పుకారే అని టాక్‌. ఎన్టీఆర్ పాత్ర కోసం ప్ర‌కాష్ రాజ్‌ని ఎంచుకొన్నార‌న్న విష‌యంలో ఎలాంటి నిజం లేద‌ని, ఇదంతా ఒట్టిమాటేన‌ని ప్ర‌కాష్ రాజ్ స‌న్నిహిత వ‌ర్గాలు తెలిపాయి. ఇటీవ‌ల వ‌ర్మ – ప్ర‌కాష్ రాజ్‌క‌లుసుకొన్న మాట నిజ‌మేన‌ని, అయితే ఎక్కడా ఎన్టీఆర్ సినిమా ప్ర‌స్తావ‌న రాలేద‌ని చెబుతున్నారు. దాంతో ఎన్టీఆర్ కోసం రామూ అన్వేష‌ణ ఇంకా ఓ కొలిక్కి రాలేద‌ని అర్థమ‌వుతోంది. రంగ‌, వీర‌ప్ప‌న్‌.. ఇలా నిజ జీవిత క‌థ‌ల్ని తెర‌కెక్కించ‌డం రామూకి కొత్తేం కాదు. అయితే.. ఇలాంటి సంద‌ర్భం వ‌చ్చిన ప్ర‌తీసారీ పేరున్న న‌టీన‌టుల్ని కాకుండా కొత్త‌వారిని ఎంచుకోవ‌డం వ‌ర్మ‌కి అల‌వాటు. ఈసారీ ఆయ‌న కొత్త న‌టుడినే ఎన్టీఆర్‌గా చూపించే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. మ‌రి ఎన్టీఆర్‌గా క‌నిపించే అవ‌కాశం ఎవ‌రికి ద‌క్కుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘పుష్ష 2’ సెట్లో గొడ‌వ జ‌రిగిందా?

జానీ మాస్ట‌ర్ వ్య‌వ‌హారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. రోజుకో నిజం బ‌య‌ట‌కు వ‌స్తోంది. జానీ మాస్ట‌ర్‌కూ బాధితురాలికీ మ‌ధ్య స‌యోధ్య కుద‌ర్చాల‌ని ఓ పెద్ద హీరో ప్ర‌య‌త్నించిన‌ట్టు వార్త‌లొచ్చాయి. ఇప్పుడు ద‌ర్శ‌కుడు సుకుమార్...

ఆ ప్రజాగ్రహ ఓటులోనే బూడిదయ్యారు జగన్ గారూ !

జగన్ రెడ్డి ఓడిపోయినా ఇసుమంత కూడా మారలేదని తనను వదిలి పోతున్న పార్టీ నేతల గురించి మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు చేసిన వ్యాఖ్యలే నిరూపిస్తున్నాయి. ఎవరు పోయినా పర్వాలేదని.. ప్రజల...

కుక్కలకు వల వేశారు.. కాంతి రాణా కోర్టుకెళ్లారు !

హీరోయిన్ జెత్వానీ కేసులో పరారీలో ఉన్న కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్టు చేశారు. డెహ్రాడూన్ లో దాక్కుని తన స్నేహితుడి ఫోన్ వాడుతున్న ఆయనపై నిఘా పెట్టి పోలీసులు పట్టుకున్నారు....

బీజేపీ నేతలు మనుషులైతే చంద్రబాబును తిట్టాలి : జగన్

జగన్ రెడ్డి బీజేపీ నేతలకు పెద్ద టెస్టే పెట్టారు. బీజేపీ నేతలు .. మనషులు అయితే చంద్రబాబును తిట్టాలట. బహుశా.. ఆయన అధికారంలో ఉన్నప్పుడు .. తనకు గిలిగింతలు పెట్టడానికి అందరూ తిట్టారు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close